Chhatrapati Shivaji Maharaj
-
లోక్‌సభ బరిలో ఛత్రపతి శివాజీ వారసుడు..
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఓ వైపు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) రాబోయే లోక్‌సభ ఎన్నికలకు తన సీట్ల షేరింగ్ ఫార్ములాను ఖరారు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మరోవైపు కాంగ్రెస్ మాత్రం రాజకుటుంబీకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు ఛత్రపతి షాహూ మహారాజ్‌ను కొల్హాపూర్ నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. కొల్హాపూర్ మాజీ రాజకుటుంబానికి అధిపతిగా ఛత్రపతి షాహూ మహారాజ్‌కు రాష్ట్రవ్యాప్తంగా అపారమైన గౌరవం ఉంది. రాజకీయంగా కాంగ్రెస్‌తో జతకట్టినప్పటికీ, 1998లో లోక్‌సభ ఎన్నికల్లో వైఫల్యం తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. కొల్హాపూర్ రాజర్షి ఛత్రపతి షాహు మనవడైన ఆయనకు మరాఠా ప్రజల్లో ఉన్న గుర్తింపు, స్థాయి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తుంది. బీజేపీ మాజీ ఎంపి ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు తండ్రి ఛత్రపతి షాహూ మహారాజ్ మరాఠా సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి కూడా. 2023 జూన్‌లో జరిగిన మతపరమైన అల్లర్ల తరువాత, షాహూ ఛత్రపతి కొల్హాపూర్‌లో 'సద్భావన' ర్యాలీకి నాయకత్వం వహించారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఛత్రపతి షాహూ మహారాజ్ నిర్ణయించుకున్నారని ఆయన కుమారుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్ తెలిపారు. తన తండ్రి ఇప్పటికే రేసులో ఉన్నందున తాను పోటీ నుంచి తప్పుకొన్నట్లు స్పష్టం చేసిన ఆయన.. తన తండ్రి విజయానికి సహకరించాలని కార్యకర్తలను కోరారు. -
మహారాష్ట్ర ఆసుపత్రిలో ఘోరం
థానే: మహారాష్ట్రలో థానే జిల్లాలోని కాల్వా పట్టణంలో ఘోరం జరిగింది. ఇక్కడి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో గత 24 గంటల వ్యవధిలో 18 మంది రోగులు మృతిచెందారు. వీరిలో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. మృతుల్లో 12 మంది 50 ఏళ్ల వయసు దాటినవారే. బాధితులు మూత్రపిండాల్లో రాళ్లు, పక్షవాతం, అల్సర్, న్యుమోనియా తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. ఏ కారణంతో వారు చనిపోయారన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఇలా ఉండగా, ఆసుపత్రిలో ఒక్క రోజు వ్యవధిలో 18 మంది రోగులు మృతిచెందడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం రాష్ట్ర ఆరోగ్య సేవల కమిషనర్ నేతృత్వంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ఆసుపత్రిలో సామర్థ్యానికి మించి రోగులు ఉన్నారని, వారికి వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని థానే మాజీ మేయర్ నరేశ్ మాక్సే చెప్పారు. -
ఛత్రపతి శివాజీ జీవితం స్ఫూర్తిదాయకం
ముంబై: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన నిరంతరం తపించారని చెప్పారు. శివాజీ విధానాలు, పాలనా వ్యవస్థ ఈనాటికీ అనుసరణీయమని పేర్కొన్నారు. మరాఠా రాజుగా ఛత్రపతి పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ కోటపై రాష్ట్రస్థాయి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం పంపించారు. శివాజీ దార్శనికత, అరుదైన వ్యక్తిత్వం చరిత్రలోని ఇతర రాజుల కంటే భిన్నమని మోదీ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ నినాదమైన ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ శివాజీ మహారాజ్ ఆలోచనలు, ఆశయాలకు ప్రతిబింబమని వివరించారు. ఆయన వీరత్వం, భయానికి తావులేని కార్యాచరణ, వ్యూహాత్మక నైపుణ్యాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్‌లో 22న మోదీ ప్రసంగం వాషింగ్టన్: భారత ప్రధాని మోదీ జూన్ 21నుంచి 24వ తేదీ వరకు అమెరికాలో అధికారికంగా పర్యటించనున్నారు. 22న అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించనున్నారు. భవిష్యత్ భారతం, రెండు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన ప్రసంగిస్తారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. 22న వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే విందులో మోదీ పాల్గొంటారు. ఉభయసభలైన ప్రతినిధుల సభ, సెనేట్నుద్దేశించి మోదీ మొదటిసారిగా 2016లో ప్రసంగించారు. -
మహారాణి పాత్రలో నటించనున్న రష్మిక మందన్నా!
మహారాణిగా నిర్ణయాలు తీసుకోనున్నారట హీరోయిన్ రష్మికా మందన్నా. మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా హిందీలో ఓ పీరియాడికల్ ఫిల్మ్ రూపొందనుంది. ఈ చిత్రానికి ‘ఛావా’ అనే టైటిల్ అనుకుంటున్నారట. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ కౌశాల్ పోషించనున్నారు. శంభాజీ భార్య మహారాణి ఏసుబాయి భోంస్లే పాత్రలో రష్మికా మందన్నా నటించనున్నారని సమాచారం. ఈ సినిమా కథ నచ్చి రష్మికా మందన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ కాలపు యాక్సెంట్ నేర్చుకోవడం కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని భోగట్టా. యుద్ధాల కోసం శంభాజీ పక్క దేశాలకు వెళ్లినప్పుడు, రాజమహల్లో రాణిగా ఏసుబాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎలాంటి రాజకీయ వ్యూహాలను రచించారు? అనే కోణంలో కూడా ఈ సినిమా కథ ఉండేలా స్క్రిప్ట్‌ను రెడీ చేశారట లక్ష్మణ్. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరులో ఆరంభించాలనుకుంటున్నారని టాక్. ఇక ఇప్పటికే హిందీలో ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ సినిమాలు చేసిన రష్మికా మందన్నా ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ హీరోగా రూపొందు తున్న ‘పుష్ప: ది రూల్’లో రష్మికా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
శివాజీ వ్యాఖ్యల దుమారం: గవర్నర్‌కు సపోర్ట్‌గా..
ముంబై: మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యలతో వివాదంలోకి దిగారు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ. ఛత్రపతి శివాజీ పాత ఐకాన్ అంటూ బహిరంగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మహా సర్కార్‌ను సైతం ఇరకాటంలో పడేశాయి. శివాజీని అగౌరవపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి.. గవర్నర్‌కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు ఆ అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. ఫడ్నవిస్ భార్య అమృత.. గవర్నర్ కోష్యారీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘వ్యక్తిగతంగా గవర్నర్‌గారు నాకు తెలుసు. మరాఠా సంస్కృతి మీద ఆయనకు ఎంతో గౌరవం ఉంది. ఆయన ఇక్కడికి వచ్చాకే మరాఠీ నేర్చుకున్నారు. మరాఠీలను ఆయన ఎంత ఇష్టపడతారో.. దగ్గరుండి మరీ చూశా. ఆయన ఏదో అన్నారని కాదు. కానీ, మనస్ఫూర్తిగా ఆయన మరాఠాను గౌరవించే మనిషే అంటూ ఆమె విలేఖరులతో చెప్పారు. ఒకవైపు శివాజీ వ్యాఖ్యల ఆధారంగా గవర్నర్‌పై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. గవర్నర్ రీకాల్ కోసం ప్రయత్నించాలని మహా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఈ తరుణంలో.. అమృతా ఫడ్నవిస్ వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీని, బీజేపీ-షిండే శివసేన కూటమి సర్కార్‌ను మరింత ఇరకాటంలో పడేశాయి. ప్రతిపక్షాలు అమృత కామెంట్ల ఆధారంగా బీజేపీపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఉద్దవ్ థాక్రే.. కేంద్రం అమెజాన్ పార్శిల్లో కోష్యారీని పంపించిందంటూ ఎద్దేవా చేశారు. కోష్యారీని తప్పించకపోతే.. అన్ని పార్టీలను పోగుజేసి వ్యతిరేక నిరసనలు కొనసాగిస్తామని థాక్రే హెచ్చరించారు. కేంద్రాన్ని ఉద్దేశిస్తూ.. ‘‘మీరు పంపిన శాంపిల్‌ను మీరే తీసుకెళ్లండి. ఒకవేళ ఆయన్ని ఓల్డేజ్ హోంకి పంపించాల్సి వస్తే ఆ పని చేయండి. అంతేకానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఆయన్ని ఉంచకండి అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు థాక్రే. మరోవైపు గవర్నర్ వ్యాఖ్యలపై నిరసన కోసం.. థాక్రే శివసేన వర్గపు నేత సంజయ్ రౌత్.. కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్‌ను కలిసి చర్చించారు. ఇదిలా ఉండగా.. శివాజీపై వ్యాఖ్యల నేపథ్యంలో గవర్నర్ కోష్యారీని కేంద్రం ఢిల్లీకి పిలిపించుకున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: శివాజీపై గవర్నర్ వ్యాఖ్యలు.. గడ్కరీ ఏమన్నారంటే.. -
శివాజీ మహారాజ్ వివాదంపై స్పందించిన టీటీడీ
-
రూ.3643 కోట్లతో భారీ శివాజీ విగ్రహం
ముంబై : అరేబియా మహాసముద్రంలో ఏర్పాటు చేయనున్న మరాఠీ మహారాజు ఛత్రపతి శివాజీ మహా విగ్రహానికి(శివ్ స్మారక్) కావాల్సిన నిధులను మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విగ్రహ ఏర్పాటుకై రూ.3643.78 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత నెల 1న రాష్ట్ర కేబినెట్ సమావేశమై విగ్రహ ఏర్పాటుకు రూ.3700.84 కోట్లు కేటాయించింది. అయితే అధికారికంగా మాత్రం రూ. 56.70కోట్లు తగ్గించి రూ.3643.78కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ విగ్రహాన్ని 2022-2023 ఏడాదికల్లా పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. -
ఠాక్రే నుంచి నేర్చుకోవాల్సిన అగత్యం లేదు!
లక్నో: తనను చెప్పుతో కొట్టాలనిపించిందంటూ శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. మరాఠా యోధుడు చత్రపతి శివాజీ ఫొటోకు యోగి చెప్పులు ధరించి పూలమాల వేయడాన్ని ఠాక్రే తప్పుబట్టారు. నివాళులు అర్పించే విషయంలో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసునని, ఈ విషయంలో ఉద్ధవ్ నుంచి మర్యాద, సంస్కారం నేర్చుకోవాల్సిన అగత్యం తనకు పట్టలేదని యోగి అన్నారు. ‘ఉద్ధవ్ ఠాక్రేకు నిజమేమిటో తెలియదు. ఉద్ధవ్ నుంచి మర్యాదలు నేర్చుకోవాల్సి అగత్యం నాకు పట్టలేదు. ఆయన కన్నా నాకు ఎక్కువ సంస్కారం, మర్యాదలు తెలుసు. నివాళులు ఎలా అర్పించాలో నాకు తెలుసు. ఆ విషయంలో ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని యోగి అన్నారు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), శివసేనల మధ్య మాటలయుద్ధం రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. పాల్ఘడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ఫడ్నవీస్ ఆడియో టేపులను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే విడుదల చేశారు. ఆ టేపులో ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా తెగించాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలున్నాయి. అవి దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో యూపీ సీఎం యోగిని ఓ భోగి అని సంభోదిస్తూ ఉద్ధవ్ ఠాక్రే యోగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరాఠా యోధుడు చత్రపతి శివాజీ ఫొటోకు యోగి చెప్పులు ధరించి పూలమాల వేయడాన్ని ఠాక్రే తప్పుబట్టారు. ‘అది చూశాక అవే చెప్పులతో యోగి చెంపలు పగలగొట్టాలనిపించింది. యోగి అంటే అన్ని వదిలి కొండల మధ్య జపం చేసుకోవాలి. కానీ ఈయన మాత్రం సీఎం కుర్చీ మీద కుర్చున్నారు. అతను యోగి కాదని, భోగి’ అని పేర్కొన్నారు. -
శివాజీ స్మారకానికి మోదీ జలపూజ
-
శివాజీ స్మారకానికి మోదీ జలపూజ
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహాలు ♦ ముంబై తీరానికి 1.5 కి.మీ. దూరంలో ఏర్పాటు ముంబై: ముంబై తీరానికి సమీపంలో సముద్రంలో నిర్మించ తలపెట్టిన ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ స్మారక ( ఎత్తు192 మీటర్లు) నిర్మాణానికి శనివారం ప్రధాని మోదీ జలపూజ చేశారు. దక్షిణ ముంబైలోని తీరం నుంచి 1.5 కి.మీ దూరంలో రూ.3,600కోట్లతో ఈ స్మారకాన్ని నిర్మించనున్నారు. గిరుగావ్ చౌపట్టి బీచ్ నుంచి హోవర్‌క్రాఫ్ట్ (కోస్టుగార్డు ప్రత్యేక నౌక)లో అరేబియా సముద్రంలోని స్మారకం నిర్మించే ప్రాంతానికి వెళ్లి జలపూజ చేశారు. మహారాష్ట్రలోని అన్ని జిల్లాలనుంచి తీసుకొచ్చిన మట్టి, వివిధ నదుల నుంచి తీసుకొచ్చిన నీరు నింపిన కలశాలను మోదీ సముద్రంలో విసర్జనం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడ్నవిస్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతోపాటు ఛత్రపతి శివాజీ వారసులు ఉదయన్ రాజే, శంభాజీ రాజే (ఇద్దరూ ఎంపీలే) మోదీతో పాటు హోవర్‌క్రాఫ్ట్‌లో వెళ్లారు. ఈ స్మారకంలో శివాజీ విగ్రహం, మ్యూజియం, ఆడిటోరియం, రంగస్థల వేదిక, ఎగ్జిబిషన్ గ్యాలరీ ఉంటాయి. శివాజీ స్మారకానికి శంకుస్థాపన చేయటం నా అదృష్టం. అందరూ శివాజీ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని తర్వాత జరిగిన కార్యక్రమంలో మోదీ అన్నారు. అనంతరం లక్షా ఆరు వేల కోట్లతో ముంబై డీఎన్ నగర్– బీకేసీ–మాన్ ఖుర్ద్ (మెట్రో–2), వడాల–ఘట్కోపర్–ములుండ్– థానే–కాసార్ వడవలి (మెట్రో–4) తదితర కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు.