
థానే: మహారాష్ట్రలో థానే జిల్లాలోని కాల్వా పట్టణంలో ఘోరం జరిగింది. ఇక్కడి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో గత 24 గంటల వ్యవధిలో 18 మంది రోగులు మృతిచెందారు. వీరిలో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. మృతుల్లో 12 మంది 50 ఏళ్ల వయసు దాటినవారే. బాధితులు మూత్రపిండాల్లో రాళ్లు, పక్షవాతం, అల్సర్, న్యుమోనియా తదితర వ్యాధులతో బాధపడుతున్నారు.
ఏ కారణంతో వారు చనిపోయారన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఇలా ఉండగా, ఆసుపత్రిలో ఒక్క రోజు వ్యవధిలో 18 మంది రోగులు మృతిచెందడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం రాష్ట్ర ఆరోగ్య సేవల కమిషనర్ నేతృత్వంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ఆసుపత్రిలో సామర్థ్యానికి మించి రోగులు ఉన్నారని, వారికి వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని థానే మాజీ మేయర్ నరేశ్ మాక్సే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment