Patients Died
-
మహారాష్ట్ర ఆసుపత్రిలో ఘోరం
థానే: మహారాష్ట్రలో థానే జిల్లాలోని కాల్వా పట్టణంలో ఘోరం జరిగింది. ఇక్కడి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో గత 24 గంటల వ్యవధిలో 18 మంది రోగులు మృతిచెందారు. వీరిలో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. మృతుల్లో 12 మంది 50 ఏళ్ల వయసు దాటినవారే. బాధితులు మూత్రపిండాల్లో రాళ్లు, పక్షవాతం, అల్సర్, న్యుమోనియా తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. ఏ కారణంతో వారు చనిపోయారన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఇలా ఉండగా, ఆసుపత్రిలో ఒక్క రోజు వ్యవధిలో 18 మంది రోగులు మృతిచెందడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం రాష్ట్ర ఆరోగ్య సేవల కమిషనర్ నేతృత్వంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ఆసుపత్రిలో సామర్థ్యానికి మించి రోగులు ఉన్నారని, వారికి వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని థానే మాజీ మేయర్ నరేశ్ మాక్సే చెప్పారు. -
ఘోరం : 8 మంది కరోనా రోగులు ఆహుతి
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకపక్క కరోనా విలయంతో దేశ ప్రజలు వణికిపోతోంటే..ఆసుపత్రిలో సంభవించిన అగ్నిప్రమాదం మరింత ఆందోళన రేపింది. అహమ్మాదాబాద్ లోని కోవిడ్-19 ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది కరోనా రోగులు సజీవ దహనం కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. నవరంగపురలోని శ్రేయ్ ఆసుపత్రిలో గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు భారీగా మంటలు చెలరేగాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో 8 మంది రోగులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. సుమారు 40 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదానికి కారణం తెలియరాలేదు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అహ్మదాబాద్ నగర బి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఎల్బీ జాలా తెలిపారు. చాలామందిని రక్షించినట్టు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
ఆస్పత్రిలో మంటలు : కరోనా బాధితుల మృతి
మాస్కో: రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ కోవిడ్ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి వెంటిలేటర్ నుంచి మంటలు వ్యాపించడంతో ఐదుగురు కరోనా బాధితులు మరణించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బంది అక్కడ చికిత్స పొందుతున్న 150మందిని కాపాడి సమీపంలోని మరో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న సమయంలో ఓవర్‌లోడ్ కారణంగానే వెంటిలేటర్ నుంచి మంటలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. రష్యాలో ఇప్పటి వరకు 2,32,243 కరోనా కేసులు నమోదవ్వగా.. 2,116 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి నుంచి 43,152 మంది కోలుకోని డిశ్చార్జి కాగా.. 1,18,615 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి. చదవండి: రష్యాను వణికిస్తోన్న కరోనా -
ఆస్పత్రిలో ఘోరం.. పెద్ద సంఖ్యలో రోగుల మృతి
-
ఆస్పత్రిలో ఘోరం.. పెద్ద సంఖ్యలో రోగుల మృతి
మిర్యాంగ్ : దక్షిణకొరియాలోని ఓ ఆస్పత్రిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో సుమారు 40 మంది రోగులు మృతిచెందారు. ప్రఖ్యాత మిర్యాంగ్ నగరంలోని సెజాంగ్ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చెలరేగిన మంటలు.. నిమిషాల్లోనే ఆరంతస్తుల భవనాన్ని బూడిద చేశాయి. ‘‘ఈ ఘటనలో 40 మంది చనిపోగా, మరో 60 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది’ అని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో సుమారు 200 మంది రోగులు ఆస్పత్రిలో ఉన్నారు. అందరినీ కాపాడలేకపోయాం.. : ‘‘రెండో అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డులో మంటలు రావడం చూశాం. మరుక్షణంలో ఫైర్ అలారం మోగింది. అక్కడి రోగుల్ని వడివడిగా బయటికి తీసుకొచ్చేప్రయత్నం చేశాం. అంతలోనే మంటలు పై అంతస్తులకు వ్యాపించాయి. ఎటుచూసినా దట్టమైన పొగ.. ఊపిరాడని పరిస్థితి. ఎలాగోలా 100 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాం. మంటలు పెరిగిపోవడంతో అందరినీ కాపాడలేకపోయాం’’ అని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. సెజాంగ్ నుంచి బయటికి తీసుకొచ్చిన రోగులను సమీపంలోని ఇతర ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అధ్యక్షుడి ఎమర్జెన్సీ మీటింగ్ : సెజాంగ్ ఆస్పత్రిలో ఘోర ప్రమాద ఘటనపై ఉత్తరకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ విచారం వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే.. అందుబాటులో ఉన్న అధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. సహాయకార్యక్రమాలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. 2008 నాటి సబ్‌వేస్టేషన్ అగ్నిప్రమాదం తర్వాత దక్షిణ కొరియాలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం సెజాంగ్ ఆస్పత్రిదే కావడం గమనార్హం. నాటి సబ్వే ప్రమాదంలో 192 మంది ప్రాణాలుకోల్పోయారు. -
13మందిని బలితీసుకున్న డాక్టర్ల సమ్మె
సాక్షి, పట్నా: రోగి కుటుంబ సభ్యులు దాడి చేశారని నిరసనగా చేపట్టిన డాక్టర్ల సమ్మె 13 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ విచారకర ఘటన బీహార్‌లోని పట్నా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వైద్యం కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన రోగులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడిచారు. ఓరోగి మృతిని తట్టుకోలేని అతని బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడి చేశారు. రెండు నెలల వ్యవధిలో మూడో ఘటన కావడంతో సుమారు 500 మంది జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. దీంతో అత్యవసర చికిత్సలు నిలిచిపోయాయి. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సుమారు 13 మంది ప్రాణాలు వదిలారని, చేసేదేమి లేక రోగులను ఇతర ప్రయివేట్ ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు మీడియాకు తెలిపారు. సీనియర్ డాక్టర్లతో ఎమర్జన్సీ వార్డులో ట్రీట్మెంట్ అందిస్తున్నామని, ఎక్కువ సంఖ్యలో రోగులు ఉండటంతో ఏమి చేయలేకపోయామన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రక్షణ కల్పించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక 13 మంది మృతి చెందటంతో బీహార్ ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్ పాండే జూడాలను చర్చలకు ఆహ్వానించారు. -
నిలోఫర్‌లో మరణమృదంగం
-
నిలోఫర్‌లో మరణమృదంగం
► వారం రోజుల్లో పది మంది బాలింతలు మృతి ► ఆపరేషన్ థియేటర్లపై మృతుల బంధువుల దాడి ► మూడు రోజుల నుంచి ఓటీలు బంద్ ► నేడు అన్ని విభాగాధిపతులతో అత్యవసర సమావేశం సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిలోఫర్ నవజాత శిశువుల సంరక్షణ కేంద్రంలో రోజుకు సగటున 20 ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో పది సహజ ప్రసవాలు కాగా, మరో పది సిజేరియన్లు. మందుల్లో నాణత్యా లోపం, ఆపరేషన్ థియేటర్లలోని ఇన్ఫెక్షన్తో పాటు వైద్యపరమైన నిర్లక్ష్యం వల్ల కేవలం వారం రోజుల్లో ఇక్కడ పది మంది బాలింతలు మృతి చెందినట్లు సమాచారం. ఈ మరణాలపై బాలింతల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మృతురాలికి సంబంధించిన బంధువులు ఏకంగా ఆపరేషన్ థియేటర్‌పై దాడికి దిగారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం మరో ఇద్దరు బాలింతలను చివరి నిమిషంలో ఉస్మానియాకు తరలించగా వారు అక్కడ కన్నుమూసినట్లు తెలిసింది. ఈ విషయం బయటికి పొక్కకుండా ఆస్పత్రి యంత్రాంగం జాగ్రత్త పడుతోంది. అత్యవసర ప్రసవాలు మినహా మిగిలన వాటన్నింటినీ నిలిపివేసింది. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలను సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. పొట్టలో దూది పెట్టి కుట్టిన వైద్యులు ప్రసవ సమయంలో అధిక రక్తస్రావ సమస్యలు తలెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వీరికి ఎక్కించేందుకు అవసరమైన రక్తం ఆస్పత్రిలో దొరకడం లేదు. క్రిటికల్‌కేర్ యూనిట్ కూడా లేక పోవడంతో అధిక రక్తస్రావం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలింతలను చివరకు ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులకు తరలిస్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో బాలింతలు మత్యువాత పడుతున్నారు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం ఓ గర్భిణికి సిజేరియన్ చేశారు. ప్రసవ సమయంలో అవుతున్న రక్తస్త్రావాన్ని తూడ్చేందుకు ఉపయోగించే దూది బట్టను కడపులో అలాగే పెట్టి కుట్టేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ బాధితురాలిని చివరి నిమిషంలో ఉస్మానియాకు తరలించారు. తీరా అక్కడి వైద్యులు స్కానింగ్ నిర్వహించగా ఈ విషయం బయటపడింది. వైద్యులు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడం వల్లే ఇలా జరిగిందని తేలింది. ఉదయం సిజేరియన్ చేసిన బాలింతల్లో రోజుకు సగటున ఒకరికి మధ్యాహ్నం మరోసారి సర్జరీ చేస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటిండెంట్ సురేష్‌కుమార్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కాగా గైనిక్ వార్డులో అసలే సిబ్బంది కొరత ఉంది. దీనికితోడు యూనిట్ 1, యూనిట్–2కు సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లు లాంగ్‌లీవులో విదేశాలకు వెళ్లారు. పీజీ విద్యార్థుల వల్ల సిజేరియన్లు చేయించడం, డెలివరి అనంతరం బాలింతలకు వేస్తున్న ఇంజెక్షన్లు వికటించడం వల్ల మృతులు పెరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
విద్యుత్ కోతలతో పేషంట్ మృతి