ప్రతిష్టాత్మక నిలోఫర్ నవజాత శిశువుల సంరక్షణ కేంద్రంలో రోజుకు సగటున 20 ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో పది సహజ ప్రసవాలు కాగా, మరో పది సిజేరియన్లు. మందుల్లో నాణత్యా లోపం, ఆపరేషన్ థియేటర్లలోని ఇన్‌ఫెక్షన్‌తో పాటు వైద్యపరమైన నిర్లక్ష్యం వల్ల కేవలం వారం రోజుల్లో ఇక్కడ పది మంది బాలింతలు మృతి చెందినట్లు సమాచారం.