మాస్కో: రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ కోవిడ్ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి వెంటిలేటర్ నుంచి మంటలు వ్యాపించడంతో ఐదుగురు కరోనా బాధితులు మరణించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బంది అక్కడ చికిత్స పొందుతున్న 150మందిని కాపాడి సమీపంలోని మరో ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న సమయంలో ఓవర్‌లోడ్ కారణంగానే వెంటిలేటర్ నుంచి మంటలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. రష్యాలో ఇప్పటి వరకు 2,32,243 కరోనా కేసులు నమోదవ్వగా.. 2,116 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి నుంచి 43,152 మంది కోలుకోని డిశ్చార్జి కాగా.. 1,18,615 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి.
చదవండి: రష్యాను వణికిస్తోన్న కరోనా
Comments
Please login to add a commentAdd a comment