వెనక్కి వెళ్దామా... | Prabhas Pooja Hegde Romance in itali | Sakshi
Sakshi News home page

వెనక్కి వెళ్దామా...

Published Sat, Oct 13 2018 3:46 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

Prabhas Pooja Hegde Romance in itali - Sakshi

ప్రభాస్‌

సినిమా అంటేనే మ్యాజికల్‌ ప్రపంచం. సడెన్‌గా టైమ్‌ మిషన్‌లో పెట్టి ముందుకు తీసుకెళ్లగలరు, లేదా వెనక్కీ తీసుకెళ్లగలరు. ఇప్పుడు ఇలానే టైమ్‌ మిషన్‌ ఎక్కించి మనందర్నీ ఒక 60 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ. ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ ఓ పీరియాడికల్‌ ప్రేమ కథ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఎక్కువ శాతం ఇటలీలో షూటింగ్‌ జరుపుకోనుంది. ఆల్రెడీ 1960 ఏళ్ల కాలం నాటి లుక్‌ తీసుకురావడానికి ఆర్ట్‌ డైరెక్టర్‌ యస్‌. రవీందర్‌ కొన్ని సెట్స్‌ డిజైన్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పూర్తి స్థాయి పాతకాలపు లుక్‌ రావడం కోసం ఇటలీలోని పురాతనపు, పాత మోడల్‌ వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారట. ఈ పీరియాడికల్‌ ప్రేమకథ పర్ఫెక్ట్‌గా ఉండటం కోసం టీమ్‌ చాలా శ్రద్ధ తీసుకుంటోంది. ఇందులో ప్రభాస్‌ భవిష్యవాణి చెప్పే (జ్యోతిష్యుడిగా) వ్యక్తిగా కనిపిస్తారని టాక్‌. ఈ చిత్రానికి సంగీతం: అమిత్‌ త్రివేది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement