
బాహుబలి సీరీస్ లో దేవసేనగా అలరించిన స్వీటీ అనుష్క, త్వరలో భాగమతిగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ భాగమతి లుక్ లో ఎలా కనిపించనుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
స్వీటీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ భాగమతి టీజర్ ను రిలీజ్ చేశారు. ఓ పాత కాలం బంగ్లాలోకి అనుష్క ప్రవేశించటం తరువాత తన చేతికి తానే సుత్తితో మేకు కొట్టుకోవటం లాంటి షాట్స్ తో టీజర్ ను కట్ చేశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫి మది విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటులు ఉన్నిముకుందన్, జయరామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అనుష్క ‘భాగమతి’ టీజర్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment