కేంద్రమంత్రికి చేదు అనుభవం
కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు
భవానీపురం :
మనిషి జీవితం నీటితో ముడిపడి ఉందని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన పున్నమిఘాట్‌లో పుష్కర స్నానమాచరించారు. కాగా, కేంద్రమంత్రికి కాస్త చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం లభించలేదు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో పున్నమిఘాట్‌కు వచ్చినా జిల్లా ఉన్నతాధికారులెవరు అక్కడ లేకపోవడం గమనార్హం. హడావుడిగా కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు.