punnami ghat
-
విజయవాడ నుంచి శ్రీశైలానికి గంటన్నరలో వెళ్లిపోవచ్చు!
ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలగలసి వెలసిన మహా పుణ్యక్షేత్రం.. ఇల కైలాసం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి అనేకమంది భక్తులు వస్తుంటారు. ఇప్పటి వరకు అటవీ ప్రాంతంలో ఘాట్ రోడ్డు మీద ప్రయాణం ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఇక నుంచి భక్తులకు సరికొత్త మధురానుభూతిని కలిగించేందుకు ‘సీ ప్లేన్’ను పర్యాటక శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. నీటిలో విమానం ఎక్కి.. నీటిలోనే దిగడం ఈ సీ ప్లేన్ ప్రత్యేక. అయితే, అవసరమైనప్పుడు నేలపై కూడా సీ ప్లేన్ ల్యాండ్ అవుతుంది. విజయవాడ–శ్రీశైలం మధ్య సీ ప్లేన్ నడిపేందుకు ఈ నెల 9వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించనుంది.తగ్గనున్న ప్రయాణ సమయంవిజయవాడ–శ్రీశైలం మధ్య రోడ్డు మార్గంలో సుమారు 270 కిలో మీటర్లు దూరం ఉంటుందని, సీ ప్లేన్‌లో సుమారు గంటన్నర సమయంలో చేరుకునే అవకాశం ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 14 సీటింగ్, 19 సీటింగ్ కెపాసిటీ కలిగిన రెండు సీప్లేన్లు అందుబాటులో ఉన్నాయని, ట్రయల్ రన్ తర్వాత ఖర్చు, నిర్వహణ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఎన్ని సర్వీసులు నడపాలి, టికెట్ ఎంత వసూలు చేయాలనేది నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు. తొలి దశలో విజయవాడ–శ్రీశైలం సీ ప్లేన్ విజయవంతమైతే హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల నుంచి కూడా నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇదీ సీ ప్లేన్ ప్రణాళిక...సీప్లేన్ టేకాఫ్, టేకాన్‌కు నీటిలో సుమారు 1.16 కిలో మీటర్ల పొడవు, 120 మీటర్ల వెడల్పు ఉండాలి. పర్యాటకులు సీ ప్లేన్ ఎక్కేందుకు, దిగేందుకు నీటిపై ప్రత్యేక జెట్టీలు అవసరం.శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ వద్ద గల ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో సీ ప్లేన్ ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ పున్నమి ఘాట్ నుంచి బయలుదేరి శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో సీ ప్లేన్ దిగుతుంది. అక్కడి నుంచి బోటులో ప్రయాణించి పాతాళగంగకు చేరుకుంటారు. పాతాళగంగ వద్ద ప్లాస్టిక్ జెట్టిపై ప్రయాణికులు దిగి రోప్‌వే ద్వారా పైకి వచ్చి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు.తిరుగు ప్రయాణంలో మళ్లీ సీ ప్లేన్ శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో బయలుదేరి విజయవాడ పున్నమి ఘాట్‌కు చేరుతుంది. చదవండి: నా శివయ్యను దర్శనం చేసుకోనివ్వరా.. శ్రీకాళహస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం -
కార్తీకాన శివరూపం.. కమనీయం ఆ దర్శనం! (ఫోటోలు)
-
శివ పంచాక్షరితో మారుమోగిన కృష్ణాతీరం
విజయవాడ(భవానీపురం): హరోం హర..ఓం నమశ్శివాయి అంటూ శివభక్తుల శివ పంచాక్షరితో కృష్ణాతీరం మారుమోగింది. శివ పంచాక్షరితో తానుకూడా తన్మయం చెందినట్లు కృష్ణమ్మ అలలతో సవ్వడి చేసింది. ఒక వైపు శంఖనాదం, మరోవైపు డమరుక నాదంతో భక్తులు పులకించిపోయారు. వేదికపై శరీరమంతా చితాభస్మం కలిగిన గుంటూరుకు చెందిన శివ భక్తులు బాబా, ఆయన శిష్య బృందం చేస్తున్న శివ ఘోషకు భక్తులు తమ గొంతులను కలిపారు. కార్తీకమాస సందర్భంగా భవానీపురానికి చెందిన శ్రీకన్యకా పరమేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక పున్నమి ఘాట్‌లో నిర్వహించిన మహారుద్రాభిషేకం వైభవంగా జరిగింది. శివునికి ప్రీతకరమైన విశేష ద్రవ్యాలతో, పుణ్యనదీ జలాలతో రుద్రుని అభిషేకించారు. విశేషంగా భోళాశంకరుడికి చేసిన భస్మాభిషేకం భక్తులను పరవసింపచేసింది. అభిషేకాలను భక్తులు దగ్గరగా తిలకించేందుకు నిర్వాహాకులు పలుచోట్ల ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నగర మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారు హరిబాబు, కార్పొరేటర్ యేదుపాటి రామయ్య విచ్చేసి వేదికపై ఏర్పాటు చేసిన శివలింగానికి పూజలు నిర్వహించారు. నిర్వాహకులు 70 కిలోల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయగా కలిదిండి శార రూ.3,20116లకు పాడుకుంది. ఈ మొత్తాన్ని గుంటూరులో నిర్మించనున్న కోటిలింగాల క్షేత్రం నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని అందించాల్సిందిగా నిర్వాహకులు కోరారు. -
వరాలు ఇచ్చేనా
నేడు విజయవాడకు రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు రాక పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం నంద్యాల – కడప లైను ప్రారంభం సాక్షి, విజయవాడ : రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు మంగళవారం నగరానికి రానున్నారు. పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరిస్తారు. అనంతరం డీఆర్ఎం కార్యాలయం చేరుకుని అక్కడ నుంచే నంద్యాల – ఎర్రగంట్ల రైల్వేలైనును, నంద్యాల– కడప పాసింజర్ రైలును రిమోట్ వీడియో లింక్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. ఏపీలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనుల గురించి ఆ శాఖ ఉన్నతాధికారోలనూ సమీక్షిస్తారని తెలిసింది. సాయంత్రం సంగమం వద్ద పుష్కరాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ ప్రభు ఇప్పటికే రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.తొలిసారిగా ఆయన విజయవాడ వచ్చినప్పుడు విజయవాడ– అమరావతి రైల్వే లైను నిర్మాణానికి సర్వే చేయించేందుకు శ్రీకారం చుట్టారు. రెండవసారి వచ్చినప్పుడు విజయవాడ– సికింద్రాబాద్ సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేశారు. తాజాగా విజయవాడ–ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ను ఇచ్చి రాయలసీమ వాసులు రాష్ట్రానికి వచ్చేందుకు వీలు కల్పించారు. ఈసారి ఏమీ వరాలు ఇస్తారనే అంశంపై రైల్వే వర్గాలో చర్చ జరుగుతోంది. ఈ క్రింద అంశాలపై సురేష్ ప్రభు దృష్టి పెడితే ఈ ప్రాంతవాసులకు ఉపయుక్తంగా ఉంటుందని అధికార, అనధికార వర్గాలు భావిస్తున్నాయి. –విశాఖపట్నం–తిరుపతి, విశాఖపట్నం– సికింద్రాబాద్ వయా విజయవాడ మీదగా డబుల్ డెక్కర్ రైలు నడిపేందుకు ఇప్పటికే ట్రయిల్ రన్‌ను అధికారులు పూర్తి చేశారు. కేవలం రైల్వే బోర్డు నుంచి అనుమతులు వస్తే ఈ రైళ్లు నడిచే అవకాశం ఉంది. పుష్కరాల్లో వీటిని నడపాలని చూసినా రైల్వే బోర్డు నుంచి అనుమతి రాలేదు. వీటిని మంజూరు చేస్తే ఉపయుక్తంగా వుంటుంది. – విజయవాడ రైల్వే స్టేషన్లో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జి చాలా అవసరం. గతంలో ఉన్న పుట్ ఓవర్ బ్రిడ్జికి ఒకవైపు మెట్లు తీసివేసి ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఒకవైపు రైలు ఎక్కేవాళ్లు దిగేవాళ్లు వస్తూ ఉండటంతో తొక్కిసలాట జరుగుతోంది. – పుష్కరాల సందర్భంగా గుణదల, మధురానగర్, కృష్ణాకెనాల్, రాయనపాడు రైల్వేస్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా మార్చారు. పుష్కరాల తరువాత దీన్ని కొనసాగిస్తే విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. – విజయవాడ నుంచి నాగోర్ (నాగపట్నం), అహ్మదాబాద్, ముంబాయి, షిర్డీ, కోల్‌కతాలకు కొత్త రైళ్లు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – విజయవాడ– గుడివాడ– నర్సాపురం– భీమవరం– మచిలీపట్నం, గుంటూరు– తెనాలి లైన్ల డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.120 కోట్లు గతంలో ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో గుంటూరు–తెనాలి లైను రూ.20 కోట్లు మిగిలిన వంద కోట్లు మొదటి లైనుకు కేటాయిస్తారు. ఈ రెండు లైన్లు పూర్తి చేయడానికి రూ.1,140 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేయగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించేందుకు ముందుకు వచ్చింది. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటిని వేగవంతం చేయించాల్సి ఉంది. -
ప్రయాణికులు పెరిగితేనే అంతర్జాతీయ హోదా..!
గన్నవరం : అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు. గురువారం గన్నవరం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు హోదా రావాలంటే ముందు ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య పెరగాలన్నారు. కేంద్రమంత్రికి చేదు అనుభవం భవానీపురం : కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గురువారం సాయంత్రం ఆయన పున్నమిఘాట్లో పుష్కర స్నానమాచరించారు. అయితే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం లభించలేదు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో పున్నమిఘాట్‌కు వచ్చినా జిల్లా ఉన్నతాధికారులెవరు అక్కడ లేకపోవడం గమనార్హం. హడావుడిగా కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. భూసేకరణపై చర్చలు కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుతో గన్నవరం విమానాశ్రయ విస్తరణ భూసేకరణపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, పలువురు రైతులు చర్చించారు. రైతులకు నష్టం లేకుండా భూసేకరణ చేపట్టేందుకు వీలుగా ఏలూరు కాలువ మళ్లింపు డిజైన్‌ను మార్పు చేయాలని కోరారు. మంత్రి స్పందిస్తూ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, డిజైన్ మార్పు విషయమై సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ పంపుతామని తెలిపారు. రాష్ట్రాభివృద్దికి సీఎం కృషి రావిచర్ల: రాష్ట్రవిభజన జరిగి రాష్ట్రం అష్టకష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన నడిపిస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. నూజివీడు మండలంలోని రావిచర్ల క్రాస్‌రోడ్డు వద్ద మామిడి తోటలో పుష్కరయాత్రికుల సౌకర్యార్థం రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏలూరు ఎంపీ మాగంటి బాబుతో కలిసి గురువారం కేంద్రమంత్రి సందర్శించారు. ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ రాజకీయ విలువల కోసం ప్రభుత్వం, పార్టీ కలిసి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. పుష్కర యాత్రికుల కోసం రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉచిత అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. -
కేంద్రమంత్రికి చేదు అనుభవం
కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు భవానీపురం : మనిషి జీవితం నీటితో ముడిపడి ఉందని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన పున్నమిఘాట్లో పుష్కర స్నానమాచరించారు. కాగా, కేంద్రమంత్రికి కాస్త చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం లభించలేదు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో పున్నమిఘాట్‌కు వచ్చినా జిల్లా ఉన్నతాధికారులెవరు అక్కడ లేకపోవడం గమనార్హం. హడావుడిగా కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. -
పున్నమిఘాట్లో వైఎస్ జగన్ పుష్కరస్నానం
విజయవాడ: వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడలోని పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండప్రదానం చేశారు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎయిర్‌పోర్టు వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు పార్థసారధి, సామినేని ఉదయభాను, కొడాలి నాని, రక్షణనిధి, జోగి రమేశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి నేరుగా పున్నమిఘాట్లో ఉన్న వీఐపీ ఘాట్‌కు వైఎస్ జగన్ చేరుకుని పుష్కర స్నానమాచరించి, పిండ ప్రదానం చేశారు. పుష్కర స్నానానికి ముందు జగన్.. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత లబ్బిపేటలోని షిరిడీసాయిని దర్శించుకున్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కర స్నానం అనంతరం కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజవర్గంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుష్కర స్నానాలకెళ్లి మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
'నారా లోకేష్‌తో చర్చకు సిద్ధం'
విజయవాడ: రెండేళ్ల అభివృద్ధిపై చర్చకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌తో చర్చకు సిద్ధమని సినీ హీరో శివాజీ స్పష్టం చేశారు. గురువారం విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఆయన పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం హీరో శివాజీ విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చేసిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు పిండం పెట్టినట్లు తెలిపారు. అలాగే ప్రత్యేక హోదా వద్దు... ప్యాకేజీ ముద్దు అన్నవాళ్లకు కూడా పిండం పెట్టినట్లు వెల్లడించారు. హోదా వద్దు ప్యాకేజీ కావాలి అని అడుగుతుంది దోచుకోవడానికే అని నాయకులపై శివాజీ మండిపడ్డారు. ప్రత్యేక హోదా నూటికి నూరు శాతం సంజీవనే అని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమా ? అంటూ ప్రతిపక్షాలులకు లోకేష్ ఇటీవల విసిరిన సవాల్‌ను శివాజీ స్వీకరించారు. ఈ నేపథ్యంలో చర్చకు సిద్ధమని శివాజీ స్పష్టం చేశారు. -
పుష్కర హారతి బాగుంది: పండిట్ రవిశంకర్
విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఇస్తున్న పుష్కర హారతి బాగుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్ తెలిపారు. అలాగే పుష్కర ఏర్పాట్లు కూడా బాగున్నాయని ఆయన పేర్కొన్నారు. గురువారం ఉదయం విజయవాడలోని పున్నమిఘాట్లో రవిశంకర్ పుష్కరస్నానమాచరించారు. అనంతరం విలేకర్లతో ఆయన మాట్టాడుతూ.. గోదావరి పుష్కరాలతో పోలిస్తే క్రౌడ్ మేనేజ్మెంట్... చక్కగా నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. గోదావరి పుష్కరాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని పండిట్ రవిశంకర్ గుర్తు చేశారు. -
నేడు పుష్కరాలకు వైఎస్ జగన్
-
పున్నమీ ఘాట్‌ను అందంగా చేయాలి
కలెక్టర్ బాబు.ఎ విజయవాడ : పున్నమీ(వీఐపీ) ఘాట్‌ను అందమైన గ్రీనరీతోపాటు రోడ్డుకు ఇరువైపులా మంచి పూలమొక్కలు పెట్టి సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బాబు.ఎ సంబంధిత అధికారులను ఆదేశించారు. సబ్–కలెక్టర్ డాక్టర్ సృజన, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌తో కలిసి ఆయన మంగళవారం పున్నమీ, భవానీఘాట్లను పరిశీలించారు. పున్నమీ ఘాట్‌లో ఉన్న చెట్ల చుట్టూ ఫెన్సింగ్‌లు ఏర్పాటుచేసి లైటింగ్‌తో సుందరంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ అధికారులకు చెప్పారు. కుమ్మరిపాలెం నుంచి వచ్చే మురుగునీరు, హెడ్ వాటర్ ట్యాంకు నుంచి వచ్చే వృథా నీరు పున్నమీఘాట్లోకి చేరకుండా మళ్లించాలని సూచించారు. పున్నమీ ఘాట్‌లోకి వచ్చి, వెళ్లే రహదారులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని చెప్పారు. భవానీ ఘాట్‌లో ఉన్న నేవీ బేస్మెంట్ను తొలగించాలన్నారు. పుష్కరనగర్ ఏర్పాటు చేసే ప్రాంతంలో రెండు భారీ బోట్లను తొలగించాలని రెండు నెలల క్రితం ఆదేశించినా, ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారంలోపు తొలగించాలని ఆదేశించారు. దుర్గాఘాట్‌లోకి పనులు పూర్తయ్యే వరకు సందర్శకులను అనుమతించవద్దని చెప్పారు. మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.