'నారా లోకేష్తో చర్చకు సిద్ధం' | Tollywood Hero Shivaji takes holy dip at Punnami Ghat | Sakshi
Sakshi News home page

'నారా లోకేష్తో చర్చకు సిద్ధం'

Published Thu, Aug 18 2016 10:28 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'నారా లోకేష్తో చర్చకు సిద్ధం' - Sakshi

'నారా లోకేష్తో చర్చకు సిద్ధం'

విజయవాడ: రెండేళ్ల అభివృద్ధిపై చర్చకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు తనయుడు నారా లోకేష్తో చర్చకు సిద్ధమని సినీ హీరో శివాజీ స్పష్టం చేశారు. గురువారం విజయవాడలోని పున్నమి ఘాట్లో ఆయన పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం హీరో శివాజీ విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చేసిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు పిండం పెట్టినట్లు తెలిపారు. అలాగే ప్రత్యేక హోదా వద్దు... ప్యాకేజీ ముద్దు అన్నవాళ్లకు కూడా పిండం పెట్టినట్లు వెల్లడించారు.

హోదా వద్దు ప్యాకేజీ కావాలి అని అడుగుతుంది దోచుకోవడానికే అని నాయకులపై శివాజీ మండిపడ్డారు. ప్రత్యేక హోదా నూటికి నూరు శాతం సంజీవనే అని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమా ? అంటూ ప్రతిపక్షాలులకు లోకేష్ ఇటీవల విసిరిన సవాల్ను శివాజీ స్వీకరించారు. ఈ నేపథ్యంలో చర్చకు సిద్ధమని శివాజీ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement