'ఆ రెండు పార్టీలను నాశనం చేయడానికి ప్లాన్ గీసింది' | Shivaji takes on bjp due to ap state special status | Sakshi
Sakshi News home page

'ఆ రెండు పార్టీలను నాశనం చేయడానికి ప్లాన్ గీసింది'

Published Tue, May 5 2015 11:45 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Shivaji takes on bjp due to ap state special status

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆమరణ నిరాహర దీక్ష చేపట్టిన టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ... కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీపై నిప్పులు చెరిగారు. మంగళవారం గుంటూరులో శివాజీ మాట్లాడుతూ... బీజేపీ తెలుగు జాతి ద్రోహుల పార్టీ అని ఆయన అభివర్ణించారు. అందులో పని చేసేవాళ్లు ద్రోహులే అని శివాజీ ఆరోపించారు. టీడీపీ...వైఎస్ఆర్ సీపీలను నాశనం చేయడానికి బీజేపీ ప్లాన్ గీసిందని ఆయన విమర్శించారు.

అందులో భాగంగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని శివాజీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఐదేళ్లు కాదు.... 10 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి సన్మానాలు చేయించుకున్నారని గుర్తు చేశారు. ఏపీకి రూ. 10 వేల కోట్లు ఇచ్చారని మరో కేంద్ర మంత్రి సుజనాచౌదరి అబద్ధాలు చెప్పారని చెప్పారు.

ప్రత్యేక హోదా వచ్చే వరకు దీక్ష చేస్తానని ఈ సందర్భంగా శివాజీ స్పష్టం చేశారు. అందుకోసం అవసరమైతే సెల్ టవర్ ఎక్కుతా... రైల్వే ట్రాక్పై పడుకుంటానని శివాజీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ శివాజీ చేపట్టిన ఆమరణ నిరాహరదీక్ష మంగళవారం మూడో రోజుకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement