పున్నమీ ఘాట్‌ను అందంగా చేయాలి
పున్నమీ ఘాట్‌ను అందంగా చేయాలి
Published Wed, Aug 10 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
కలెక్టర్ బాబు.ఎ
విజయవాడ :
పున్నమీ(వీఐపీ) ఘాట్‌ను అందమైన గ్రీనరీతోపాటు రోడ్డుకు ఇరువైపులా మంచి పూలమొక్కలు పెట్టి సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బాబు.ఎ సంబంధిత అధికారులను ఆదేశించారు. సబ్–కలెక్టర్ డాక్టర్ సృజన, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌తో కలిసి ఆయన మంగళవారం పున్నమీ, భవానీఘాట్లను పరిశీలించారు. పున్నమీ ఘాట్‌లో ఉన్న చెట్ల చుట్టూ ఫెన్సింగ్‌లు ఏర్పాటుచేసి లైటింగ్‌తో సుందరంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ అధికారులకు చెప్పారు. కుమ్మరిపాలెం నుంచి వచ్చే మురుగునీరు, హెడ్ వాటర్ ట్యాంకు నుంచి వచ్చే వృథా నీరు పున్నమీఘాట్‌లోకి చేరకుండా మళ్లించాలని సూచించారు. పున్నమీ ఘాట్‌లోకి వచ్చి, వెళ్లే రహదారులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని చెప్పారు. భవానీ ఘాట్‌లో ఉన్న నేవీ బేస్‌మెంట్‌ను తొలగించాలన్నారు. పుష్కరనగర్ ఏర్పాటు చేసే ప్రాంతంలో రెండు భారీ బోట్లను తొలగించాలని రెండు నెలల క్రితం ఆదేశించినా, ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారంలోపు తొలగించాలని ఆదేశించారు. దుర్గాఘాట్‌లోకి పనులు పూర్తయ్యే వరకు సందర్శకులను అనుమతించవద్దని చెప్పారు. మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement