భాగమతి కోసం భారీ కోట సెట్ | Huge set for anushkas Bhagamathi | Sakshi
Sakshi News home page

భాగమతి కోసం భారీ కోట సెట్

Published Wed, Aug 3 2016 11:35 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

భాగమతి కోసం భారీ కోట సెట్

భాగమతి కోసం భారీ కోట సెట్

అనుష్క లీడ్ రోల్లో తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ భాగమతి. మొదట ఈ సినిమా చారిత్రక కథాంశం అని ప్రచారం జరిగినా.. తరువాత కాంటెపరరీ థ్రిల్లర్ అని తేల్చేశారు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నవాబుల కాలం నాటి కోటను సెట్ వేస్తున్నారట.

దీంతో ఈ సినిమా పూర్తిగా చారిత్రక కథాంశం కాకపోయినా.. సినిమాలో చారిత్రక నేపథ్యం ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. లేడి ఓరియంటెడ్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వం వహిస్తున్నాడు. మళయాల నటుడు ఉన్ని ముకుందన్ అనుష్కకు జోడిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం బాహుబలి, సింగం 3 సినిమాలతో బిజీగా ఉన్న అనుష్క ఆ సినిమాలు పూర్తి కాగానే భాగమతి షూటింగ్లో పాల్గొననుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement