'భాగమతి' చారిత్రక కథ కాదు | Anushka next movie bagamathi | Sakshi
Sakshi News home page

'భాగమతి' చారిత్రక కథ కాదు

Published Thu, May 12 2016 10:55 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

'భాగమతి' చారిత్రక కథ కాదు

'భాగమతి' చారిత్రక కథ కాదు

అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాల్లో నటించిన అనుష్క త్వరలో భాగమతి సినిమాలో లీడ్ రోల్లో నటించనుంది. అయితే కేవలం టైటిల్ మాత్రమే ఎనౌన్స్ చేసిన ఈ సినిమా హైదరాబాద్ నిర్మాణానికి కారణమైన చారిత్రక పాత్ర భాగమతి జీవిత కథ అన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే జానపద, చారిత్రక పాత్రల్లో నటించిన అనుష్క లీడ్ రోల్లో నటిస్తుండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. కానీ ఇప్పుడు చిత్ర దర్శకుడు అశోక్ ప్రకటనతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి.

భాగమతి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా చారిత్రక కథాంశం కాదంటూ ప్రకటించాడు అశోక్. పిల్ల జమీందార్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అశోక్ తొలి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఆ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని ప్రస్తుతం భాగమతి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అనుష్క ప్రధాన పాత్రలో తాను తెరకెక్కించబోయే సినిమా చారిత్రక కథ కాదని తెలిపిన అశోక్, ఇది థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement