bagamathi
-
ప్రతి పైసా తెరపై కనిపిస్తుంది
‘‘భాగమతి’ పూర్తి స్థాయి హారర్ సినిమా కాదు. హారర్ కథాంశం కొంత మాత్రమే ఉంటుంది. ఇతర సినిమాలకీ దీనికీ పోలిక ఉండదు. 45 రోజుల పాటు బంగ్లా సెట్లో షూటింగ్ జరిపాం. అక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి’’ అన్నారు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్. అనుష్క లీడ్ రోల్లో అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘భాగమతి’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ మీడియాతో మాట్లాడారు. ∙కథ పరంగా 300 ఏళ్ల క్రితంనాటి బంగ్లా కావాలి. దాని కోసం ఎంతో రీసెర్చ్ చేసి, కొత్త టెక్నాలజీ ఉపయోగించి 29 రోజుల్లో బంగ్లా సెట్ తీర్చిదిద్దాం. సెట్ చూసి యూనిట్ మొత్తం ఆశ్చర్యపోయారు. నిజం చెప్పాలంటే సెట్ భారీతనం యూనిట్ ఇంకాస్త ఎక్కువ కష్టపడి బెటర్ ఔట్‌ఫుట్ ఇచ్చేలా దోహదపడింది. ∙టాలీవుడ్లో ఇదొక కాస్ట్లీ సెట్ అన్నది నిజమే. ఈ సెట్ కోసం చాలా ఖర్చు చేశాం. అయితే.. పెట్టిన ప్రతిపైసా తెరపై కనిపిస్తుంది. ఇప్పటివరకు నేను వేసిన సెట్స్‌లో ఇదే బెస్ట్ అని చెప్పగలను. ∙ఏ సినిమాకైనా ముందు కథ వింటాను. అప్పుడే కథాంశం అర్థమై ఎలాంటి సెట్స్ కావాలో ఇవ్వగలం. అందరూ ఓ మంచి సినిమా చేశారని అంటున్నారు. మా వరకు మేం సిన్సియర్‌గా కష్టపడ్డాం. మా ప్రయత్నం ప్రేక్షకులను మెప్పిస్తుందని నా నమ్మకం. ∙ప్రస్తుతం మారుతి–నాగ చైతన్య కాంబినేషన్లో ఓ చిత్రం, మోహన్‌కృష్ణ ఇంద్రగంటిగారి సినిమాతో పాటు ఒక తమిళ సినిమా చేస్తున్నాను. ఇటీవల దర్శకుడు సుధీర్ వర్మ సినిమా ఒప్పుకున్నాను. -
'భాగమతి' చారిత్రక కథ కాదు
అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాల్లో నటించిన అనుష్క త్వరలో భాగమతి సినిమాలో లీడ్ రోల్లో నటించనుంది. అయితే కేవలం టైటిల్ మాత్రమే ఎనౌన్స్ చేసిన ఈ సినిమా హైదరాబాద్ నిర్మాణానికి కారణమైన చారిత్రక పాత్ర భాగమతి జీవిత కథ అన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే జానపద, చారిత్రక పాత్రల్లో నటించిన అనుష్క లీడ్ రోల్లో నటిస్తుండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. కానీ ఇప్పుడు చిత్ర దర్శకుడు అశోక్ ప్రకటనతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి. భాగమతి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా చారిత్రక కథాంశం కాదంటూ ప్రకటించాడు అశోక్. పిల్ల జమీందార్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అశోక్ తొలి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఆ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని ప్రస్తుతం భాగమతి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అనుష్క ప్రధాన పాత్రలో తాను తెరకెక్కించబోయే సినిమా చారిత్రక కథ కాదని తెలిపిన అశోక్, ఇది థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలిపాడు.