సుకుమార్‌పై ప్రేమతో...
– ఎన్టీఆర్
‘‘సుకుమార్‌గారు బయటి వ్యక్తి కాదు. నా గుండెకు దగ్గరైన వ్యక్తి. ఆయన ఎప్పుడు ఏ సినిమా నిర్మించినా నేను వస్తున్నానంటే... అది నా బాధ్యత, ప్రేమ తప్ప మరొకటి కాదు’’ అన్నారు ఎన్టీఆర్. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మించిన ‘దర్శకుడు’ టీజర్‌ను ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘సినిమా అంటే సుకుమార్‌కు ప్యాషన్. కథకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే, ప్రతి ఒక్క నటుడూ ఆయనతో పని చేయాలనుకుంటారు.
సుకుమార్ రైటింగ్స్‌పైన ప్రతిభావంతులైన కొత్తవారిని పరిచయం చేస్తున్నందుకు ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కుమారి 21ఎఫ్’ టీజర్‌ను ఎన్టీఆరే రిలీజ్ చేశారు. ఆ సినిమా చూసి బాగుందంటూ ఒక్క ట్వీట్‌తో సూపర్ హిట్ చేశారు. తనతో మాట్లాడితే నేరుగా ఆత్మతో మాట్లాడినట్టే ఉంటుంది. తన చిరునవ్వు వెనుక సముద్రమంత ప్రేమ ఉంటుంది. కోపం వెనుక చినుకంత ఆవేశం ఉంటుంది’’ అన్నారు సుకుమార్. చిత్రదర్శకుడు హరిప్రసాద్, నిర్మాతలు విజయ్‌కుమార్, థామస్ రెడ్డి, రవిచంద్ర, హీరోయిన్ ఈషా, నటి పూజిత తదితరులు పాల్గొన్నారు.