సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ కేసులో ఇరువర్గాల వాదనలు ఇన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. డేటాచోరీ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీగ్రిడ్స్ సంస్థ యజమాని ఆశోక్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూత్రా కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ డేటాపై తెలంగాణకు ఏం సంబంధమని, కేసుపై విచారించే హక్కు ఇక్కడి పోలీసులకు లేదని ఆయన అన్నారు. ఒకే కేసుపై రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారని, దీనిలో రాజకీయ దురుద్దేశ్యము తప్ప మరొకటి లేదని ఆయన కోర్టుకు తెలియజేశారు.
కేసులో సిట్ తరఫున తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్‌గా కోర్టులో వాదనలు వినిపించారు. ఐటీగ్రిడ్స్ కంపెనీ ద్వారా డేటాచోరీ జరిగినట్లు తమవద్ద ఖచ్చిమైన ఆధారాలు ఉన్నయని కోర్టుకు తెలిపారు. సంబంధిత కంపెనీ ఇదే రాష్ట్రంలో ఉన్నందున విచారించే హక్కు తెలంగాణ పోలీసులకు ఉందన్నారు. కేవలం ఏపీ డేటానే కాకుండా తెలంగాణ డేటా కూడా చోరీకి గురైందని ఆయన కోర్టుకు నివేధించారు.
Comments
Please login to add a commentAdd a comment