
‘అభినందన’ సినిమాలోని ‘అదే నువ్వు అదే నేను.. అదే గీతం పాడనా...’ అనే సూపర్‌హిట్ సాంగ్‌ను సంగీతప్రియులు మరచిపోలేరు. ఈ సూపర్‌హిట్ సాంగ్‌లోని ‘అదే నువ్వు అదే నేను’ టైటిల్‌తో ఓ సినిమా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ చిత్రం ద్వారా శశి దర్శకునిగా పరిచయమవుతున్నారు. గల్లా అశోక్, నభా నటేశ్ జంటగా నటిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ కుమారుడు,
హీరో మహేశ్‌బాబు మేన ల్లుడే గల్లా అశోక్. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపర్‌స్టార్ కృష్ణ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. చిత్రనిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గల్లా అశోక్‌ను మా బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా హీరోగా పరిచయం చేయటం ఆనందంగా ఉంది. శశి దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment