రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తేలగా, కొన్నింటిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అయితే ఇప్పుడు గెలుపు ఓటములు రెండూ కాంగ్రెస్‌కు కొత్త సవాళ్లను సృష్టించనున్నాయి.
గత కొన్నేళ్లుగా రాజస్థాన్‌లో కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ పోరుకు పునాది సీఎం కుర్చీ. ప్రస్తుత ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. రాజస్థాన్‌లో ఒకవేళ కాంగ్రెస్ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మరోమారు ముఖ్యమంత్రి పదవి కోసం యుద్ధం మొదలుకానున్నదని తెలుస్తోంది. దీనిని చూస్తుంటే మరోసారి 2018 ఎన్నికల ఫలితాల తరహా పరిస్థితి ఏర్పడవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు.
2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపొందినప్పుడు పార్టీలోని ఒక వర్గం సచిన్ పైలట్‌కు మద్దతు ఇచ్చింది. అయితే పార్టీలో అశోక్ గెహ్లాట్ సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఆయనకు మరోమారు సీఎం అయ్యే అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో ఆయన రెండున్నరేళ్ల పాటు సీఎంగా ఉండాలనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చనే వార్తలు కూడా వినిపించాయి. ఆ దిరిమిలా 2020లో సచిన్ పైలట్ తనను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చి, తిరుగుబాటుకు దిగారు. ఈ నేపధ్యంలో పైలెట్ డిప్యూటీ సీఎం పదవిని కోల్పోవలసి వచ్చింది.
అయితే ఇప్పుడు ఎన్నికల వేళ గెహ్లాట్, పైలట్‌ల మధ్య టెన్షన్ కాస్త తగ్గినట్లు కనిపించినా, ఫలితాల వెల్లడి తర్వాత మళ్లీ సమస్యలు తలెత్తడం ఖాయం అని పలువురు అంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓటమిపాలైనా గెహ్లాట్-పైలట్ అంశం కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారనుంది. అప్పుడు ఆటంతా ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య తిరుగుతుంది. అలాంటి పరిస్థితిలో వీరిద్దరి మధ్య సంబంధాలు చెడిపోతే.. పార్టీ మళ్లీ వారిని బుజ్జగించే పని చేయాల్సి వస్తుంది. రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే కాంగ్రెస్‌కు 86 నుంచి 106 సీట్లు వస్తాయని, బీజేపీకి 80 నుంచి 100 సీట్లు వస్తాయని పలు మీడియా సంస్థలు అంచనా వేశాయి.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
Comments
Please login to add a commentAdd a comment