కేఆర్‌ఎంబీ చైర్మన్‌గా అశోక్‌ గోయల్‌ | Ashok Goyal as the Chairman of KRMB | Sakshi
Sakshi News home page

కేఆర్‌ఎంబీ చైర్మన్‌గా అశోక్‌ గోయల్‌

Published Tue, May 28 2024 4:07 AM | Last Updated on Tue, May 28 2024 4:07 AM

Ashok Goyal as the Chairman of KRMB

సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌గా అశోక్‌ ఎస్‌.గో­య­ల్‌ను కేంద్ర జల్‌ శక్తి శాఖ నియమించింది. పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ(పీపీఏ) సీఈ­వోగా పనిచేస్తున్న శివ్‌నందన్‌కుమార్‌ రెండే­ళ్లుగా కృష్ణా బోర్డు చైర్మన్‌గా అదనపు బాధ్య­తలు నిర్వహిస్తున్నారు.

ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కేఆర్‌­ఎంబీ చైర్మన్‌గా అశోక్‌ను కేంద్రం నియమించింది. జూన్‌ 1న ఆయన బాధ్యతలు స్వీకరి­స్తారు. పీపీఏ సీఈవోగా మరొకరిని నియమి­స్తారా లేదా అశోక్‌కే అదనపు బాధ్యతలు అప్పగిస్తారా అనేది తేలాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement