సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ జలా శయంలోని కొద్దిపాటి నీళ్లు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కొత్త వివాదాన్ని రేకెత్తించాయి. తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీటిని సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి విడుదల చేయాలని ఆ రాష్ట్రం చేసిన విజ్ఞ ప్తిపై మంగళవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) నిర్వహించిన త్రిసభ్య కమిటీ సమావేశం కొత్త వివాదానికి వేదికైంది.
కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి డీఎం రాయిపూరే నేతృత్వంలో మధ్యాహ్నం 3.30 గంటలకు వర్చువల్‌గా జరిగిన సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ సి.నారాయణరెడ్డి పాల్గొనగా, తెలంగాణ ఈఎన్‌సీ సి.ముర ళీధర్ గైర్హాజరయ్యారు. ఏపీ ఈఎన్‌సీ నారా యణరెడ్డి ఈ సమావేశంలో మాట్లాడుతూ సాగర్ కుడికాల్వకి తాగునీటి కోసం 5 టీఎంసీలను విడుదల చేయాల్సిందేనని పట్టు బట్టారు.
తెలంగాణ ఈఎన్‌సీ హాజరు కానందున నీటి విడుదలపై ఇండెంట్ జారీ చేయ లేమని త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం రా యిపూరే స్పష్టం చేశారు. మళ్లీ త్రిసభ్య కమి టీ సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది.
బోర్డుతో తెలంగాణ ఈఎన్‌సీ భేటీ..
త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసిన తర్వా త తెలంగాణ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ప్రత్యేకంగా కృష్ణా బోర్డు అధికారులను కలి సి చర్చించారు. సాగర్‌లో నిల్వలు అడుగంటిపోయాయని, ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి కృష్ణా నదికి ఎలాంటి వరద ప్రవా హం లేదని బోర్డుకు వివరించారు.
గతేడాది శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి తమ వాటాకి మించి కృష్ణా జలాలను ఏపీ వాడుకుందని... హైదరాబాద్ జంట నగరాల తాగునీటి, భగీరథ అవసరాల కోసం తాము సాగర్‌లో తమ వాటా నీళ్లను మిగిల్చి ఉంచామని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయం
సాగర్‌లో ప్రసుత్తం 517 అడుగుల వరకే నిల్వలున్నాయని, 510 అడుగులకు తగ్గితే హైదరాబాద్ నగరానికి నీళ్లను సరఫరా చేసే అప్రోచ్ కాల్వకు నీళ్లు అందవని నారాయణరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను సంప్రదించిన అనంతరం ఆయన అనుమతితో ఏపీకి 5 టీఎంసీల నీటిని విడుదల చేసే అంశంపై తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని వివరించినట్టు తెలిసింది. తాగునీటి అవసరాల కోసం ఏపీకి 5 టీఎంసీలు అవసరం లేదని అభ్యంతరం తెలిపినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment