
ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం
కారును వేగంగా చెరువులోకి తీసుకెళ్లిన వైనం
భయంతో హడలెత్తిపోయిన చిన్నారులు
స్థానికుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం
ఆర్థిక ఇబ్బందులే కారణమని వెల్లడించిన పోలీసులు
అబ్దుల్లాపూర్‌మెట్: మార్నింగ్ వాక్ చేసేందుకు ముగ్గురు పిల్లలతో కలిసి బయటకు వచ్చిన ఓ తండ్రి.. తన పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన అశోక్ వ్యాపార నిమిత్తం నగరానికి వలస వచ్చి మీర్‌పేట పరిధిలోని అల్మాస్‌గూడ శ్రీహోమ్స్ కాలనీలో నివాసముంటున్నాడు. బిజినెస్‌లో నష్టం రావడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆత్మహత్యే శరణ్యమని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో ఉదయం 6గంటలకు తన పిల్లలు 14 ఏళ్ల అవిఘ్నశ్రీ , 13 ఏళ్ల శ్రీధర్, తొమ్మిదేళ్ల వయసున్న సహస్రను తీసుకుని కారులో బయటకు వెళ్లాడు. నేరుగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడలోని బైరాన్‌ఖాన్ చెరువు వద్దకు చేరుకున్నాడు. ద్విచక్ర వాహనాలు మాత్రమే వేళ్లేందుకు అనువుగా ఉండే చెరువు కట్టపై నుంచి కారును వేగంగా చెరువులోకి దింపాడు. సమీపంలోని తాటి చెట్లపై ఉన్న గీత కార్మికులు, రోడ్డు పక్కనే ఉన్న స్థానికులు చూస్తుండగానే కారు నీళ్లలో మునుగుతుండగా.. భయంతో వణికిపోయిన బాలుడు శ్రీధర్.. తనవైపు కిందకు దించి ఉన్న కారు అద్దం నుంచి బయటకు వచ్చి, వాహనం పైకి ఎక్కాడు.
మిగిలిన ఇద్దరు పిల్లలు సైతం అతన్ని అనుసరించారు. ఆ తర్వాత అశోక్ సైతం బయటకు వచ్చాడు. కారు పూర్తిగా నీటిలో మునుగుతున్న సమయంలో.. వేగంగా స్పందించిన స్థానికులు తాడు, ట్యూబ్ సాయంతో చెరువులోకి వెళ్లి.. ముగ్గురు పిల్లలతో పాటు అశోక్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న అశోక్‌కు ఆర్థిక సమస్యలకు తోడు పాటు భార్యతో సైతం గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తాను చనిపోతే తన పిల్లలు అనాథలవుతారనే ఉద్దేశంతోనే అశోక్ ఇలా వ్యవహరించి ఉంటాడని ఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు.
మీర్‌పేట్ పీఎస్‌లో ఫిర్యాదు
కాగా, మార్నింగ్ వాక్ కోసం పిల్లలను తీసుకెళ్లిన అశోక్ చాలా సమయం గడిచినప్పటికీ తిరిగి రాకపోవడంతో అతని తమ్ముడు సంజీవ మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇనాంగూడ చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే స్థానికులు వారిని బయటకు తీశా రు. అనంతరం మీర్‌పేట్ పీఎస్‌కు తరలించి.. అశోక్ భార్యతో పాటు అతని సో దరుడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment