రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
చెన్నారావుపేట/మట్టెవాడ : తమ కుమారుడు చదువుకుని ఉన్నత ఉద్యోగం సంపాదిస్తాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యూరుు. ఇద్దరు కొడుకుల్లాగే చిన్న కువూరుడు ఎదుగుతాడని కూలీనాలీ చేసి చదివించిన ఆ తల్లిదండ్రుల కలలు కల్లలయ్యూరుు. సివిల్స్‌కు ప్రిపేరవుతున్న ఓ యువకుడు మానసిక సమస్యతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగెం మండలం చింతలపల్లి-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వరంగల్ జీఆర్‌పీ సీఐ రవికుమార్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట వుండలంలోని ఉప్పరపల్లి గ్రావూనికి చెందిన కందుల కొమురయ్యు, కవులవ్ము దంపతులకు వుుగ్గురు కువూరులు, ఒక కూతురు ఉన్నారు.
రజక వృత్తిని చేసుకుంటూనే కువూరులను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కువూరుడు వుల్ల య్యు ట్రాన్స్‌కో ఏడీ గా భూపాల్‌పల్లిలో పనిచేస్తుండగా, రెండో కువూరుడు ఎల్లస్వామి ఎంటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నకువూరుడు అశోక్(30) పీజీ పూర్తి చేసి సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో తన చిన్న అన్నయ్యు వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. వుంగళవారం సాయుంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి రైలులో బయల్దేరిన అశోక్ అర్ధరాత్రి చింతలపల్లి-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న కేఎం 383/16 మైలు రాయివద్దకు చేరుకున్నాడు.
తన వూనసిక స్థితి సరిగ్గా లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. అశోక్ వుృతితో గ్రావుంలో విషాద ఛాయులు అలువుుకున్నారుు. కాగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు సీఐ తెలిపారు.