హైదరాబాద్: రాష్ట్రంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు అత్యవసర వైద్య సేవలు అందించే ‘108’ సిబ్బంది సమ్మె బాటకు సిద్ధమయ్యారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ కార్మికశాఖ కమిషనర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు 108’ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకుడు అశోక్ చెప్పారు.