గరగపర్రు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎంకు లేఖ
గరగపర్రు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎంకు లేఖ
Published Thu, Aug 3 2017 10:58 PM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM
–బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మాజీ ఎంపీ హర్షకుమార్
తాడితోట, (రాజమహేంద్రవరం సిటీ): గరగపర్రు వెలి జరిగి ఆగస్టు 5వ తేదీ నాటికి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ గ్రామాన్ని సందర్శించ లేదని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ విమర్శించారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన అతిపెద్ద వెలి గరగపర్రు గ్రామంలోనిదేనని ఆ లేఖలో పేర్కొన్నారు. మంత్రులు ఆ గ్రామాన్ని సందర్శించి ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదని తెలిపారు. సమస్యలు అలానే వెంటాడుతున్నా మీ కుమారుడు లోకేష్ మాత్రం అన్ని సమస్యలూ పరిష్కరించినట్లు అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీన గరపర్రు వెళ్ళేందుకు నిర్ణయించుకున్నానని, అనుమతి కోసం లేఖ రాస్తున్నానని, నాతోపాటు పోలీసులను పంపిచినాఅభ్యంతరం లేదని లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు 5, ఉదయం 10 గంటలకు గరగపర్రు బయలుదేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement