శంషాబాద్ మండలం ఎయిర్‌పోర్టు కాలనీలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఎయిర్‌పోర్టు కాలనీలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కాలనీకి చెందిన కుమార్(30) సమీపంలోని నిర్జన ప్రదేశంలో విగతజీవిగా పడి ఉండగా గురువారం ఉదయం స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు అతని తలపై బండరాళ్లతో మోది చంపేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.