- నిరుపేదలు వైద్యం అందకచనిపోతే ప్రభుత్వానిదే బాధ్యత
- వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్ కె.నగేష్, అక్కెనపల్లి కుమార్
ఆరోగ్యశ్రీని రద్దు చేసే కుట్ర
Published Wed, Oct 5 2016 11:30 PM | Last Updated on Mon, Aug 20 2018 4:22 PM
ధర్మారం : రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేసే కుట్రలో భాగంగానే నెట్‌వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించటం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేష్, జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కుమార్ ఆరోపించారు. ధర్మారంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం బిల్లులు చెల్లిం^è కపోవటంతో ప్రై వేటు ఆసుపత్రులు నిరుపేదలకు వైద్యం అందించటం లేదన్నారు. రోగాల బారినపడిన నిరుపేదలకు వైద్య సేవలందక మరణిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యసేవలందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని దివాళా రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ దశలవారీగా ఆరోగ్యశ్రీని రద్దు చేసేందుకే బిల్లులు చెల్లించటంలేదని అన్నారు. బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీకి రూ.650 కోట్లు కేటాయించిన ప్రభుత్వం విడుదల చేయకపోవటం పేదలకు శాపంగా మారిందన్నారు. జ్వరాలతో నిరుపేదలు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే వసతులు లేక నేలపై పడుకోపెట్టి వైద్యం అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలో నూతన భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ఎందుకు ప్రారంభించటం లేదనిప్రశ్నించారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిపడిన నిధులను వెంటనే మంజూరీ చేసి ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఇప్పాల మల్లేశం, వేణుమాధవరావు, రాష్ట్రసంయుక్త కార్యదర్శులు వరాల శ్రీనివాస్, గాలి ప్రశాంత్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement