ప్రమాదానికి కారణమైన కారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
Published Mon, Dec 19 2016 12:34 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
అమడగూరు: బంధువుల మనిషి చనిపోయారన్న విషయం తెలుసుకుని శనివారం అర్ధరాత్రి బయలుదేరి వెళ్తున్న సమయంలో కర్ణాటక బాగేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతుల బంధువుల వివరాల మేరకు.. అమడగూరు మండలంలోని చీకిరేవులపల్లికి చెందిన కుమార్ (24), కర్ణాటక చెంచురాయునిపల్లికి చెందిన వెంకటేష్ (22) అనే యువకులు శనివారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై మించరాయునికోటకు బయలుదేరి వెళ్లారు. బాగేపల్లి దాటగానే బెంగళూరు నేషనల్ హైవేపైకి వెళ్లే సమయంలో రోడ్డు దాటుతుండగా కళ్యాణదుర్గం నుంచి వచ్చిన ఇన్నోవా కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదానికి కారణమైన కారు
ప్రమాదానికి కారణమైన కారు
ఎమ్మెల్యే ఉన్నం బంధువుది?
ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కారు కల్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి బంధువులకు చెందినదిగా తెలిసింది. ప్రమాదంలో ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జయిపోగా వాహన డ్రైవర్ పరారయ్యాడు. ఇన్నోవా కొత్త వెహికల్ కావడంతో రిజిస్ట్రేష¯ŒS కూడా కానట్లు తెలిసింది. బాగేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు.
Advertisement
Advertisement