సీబీఐ వలలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ ఏడీ
రూ.3.7లక్షల నగదు, 23లక్షల ప్రామిసరీ నోట్స్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రైవేటు కంపెనీ నుంచి లంచం డిమాండ్ చేసిన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ (మైక్రో, స్మాల్, అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్‌ఎల్‌ఎన్ కుమార్‌ను సీబీఐ వలపన్ని అరెస్ట్ చేసింది. ఖాజాగూడకు చెందిన శైలజ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రతీ ఏటా నిర్వహించే తనిఖీలకు సంబంధించి కంపెనీకి అనుకూలంగా నివేదికిస్తానని చెప్పి ఎస్‌ఎల్‌ఎన్ కుమార్ రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు కంపెనీ యాజమాన్యం ఈ నెల 20న సీబీఐకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు స్వీకరించిన సీబీఐ అధికారులు వలవేసి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా కుమార్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు రూ.3.7లక్షల నగదు, రూ.23 లక్షల విలువైన ప్రామిసరీనోట్లు, చెక్కులు, కీలక డాక్యుమెంట్లు స్వాధీ నం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన కుమార్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవే శపెట్టగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టు దర్యాప్తు సంస్థ తెలిపింది.