నగరి, న్యూస్‌లైన్: నగరి మూడో వార్డులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఈ సందర్భంగా కేసే కుమార్‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వివ రాలు... మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ భార్య శాంతి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ఈ వార్డులో పోటీచేస్తున్నారు. ఈ వార్డులో టీడీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 23, 1 వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 3వ వార్డులోకివచ్చి టీడీపీకి మద్దతుగా ప్రచారం చేపట్టారు.
దీనిని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. వీరి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకుంది. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు కేజే కుమార్, ఆయన కుమారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరంజీవిరెడ్డి, బాబురెడ్డి, పంచాక్షర రెడ్డి మధ్య తోపులాటలు జరిగాయి. ఈ సమయంలో మాజీ మంత్రి చెంగారెడ్డి, ఆయన కుమార్తె బూత్ వద్దకు రావడంతో ఘర్షణకు దారితీసింది.
ఈ ఘర్షణలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ కుమారుడు రామ్‌కుమార్‌కు రక్తగాయాలయ్యూరుు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంఘటనా స్థలానికి చేరుకొన్న ట్రైనీ డీఎస్పీ చంద్ర ఘర్షణ పడుతున్నవారిని చెదరగొట్టడానికి లాఠీకి పని చెప్పారు. ఈ సందర్భంలో కేజే కుమార్‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు ఆర్‌కే రోజా, మాజీ మంత్రి చెంగారెడ్డి, ఆయన కుమార్తె సత్యస్వరూప ఇందిరతో డీఎస్పీ కృష్ణకిషోర్‌రెడ్డి చర్చలు జరిపారు. రెండు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు.
వైఎస్‌ఆర్ సీపీ నాయకులపై దౌర్జన్యం
Published Mon, Mar 31 2014 1:48 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement