కాంగ్రెస్ దుకాణం బంద్
- చోడవరం, మాడుగులలో వైఎస్సార్‌సీపీలో పలువురి చేరిక
- త్వరలో మరికొందరు రాక
చోడవరం, న్యూస్‌లైన్: చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట, చీడికాడ, మాడుగుల మండలాలకు చెందిన వందలాది మంది మండల, గ్రామస్థాయి నాయకులు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ప్రాంతానికి నాయకత్వం వహించిన డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ ఇటీవలే వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం తెలిసిందే.
నాయకత్వంలేని పార్టీలో ఉండటం వృథా అని భావించిన కాంగ్రెస్ కేడర్ కూడా ఆ పార్టీని వీడారు. చోడవరం మండలంలో 300 మంది, బుచ్చెయ్యపేటలో 250, రావికమతంలో 400, రోలుగుంటలో 200 మంది చీడికాడలో 300 మంది మండల, కార్యకర్తలు రాజీనామా చేశారు. వీరితోపాటు మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళ, బుధవారాల్లో సమావేశాలు నిర్వహించుకొని రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం మండలాల్లో ధర్మశ్రీ నిర్వహించిన సమావేశాల్లో వీరంతా రాజీనామాలను ప్రకటించారు. చీడికాడ మండలంలో రాజీనామా చేసిన కాంగ్రెస్ నాయకులంతా సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకులు గుడివాడ అమర్, సమన్వయకర్త బూడి ముత్యాలనాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. వీరంతా పార్టీని వీడడంతో చోడవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పూర్తిగా ఖాళీ అయిపోగా మాడుగుల నియోజకవర్గంలో అతికొద్దిమంది నాయకులు మాత్రం ఇంకా మిగిలిపోయారు.
కాబోయే సీఎం జగన్: అమర్
చీడికాడ: త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని చూస్తామని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. సోమవారం చీడికాడలో జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రా మంలో పార్టీ జెండా ఎగరాలని, దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్ర జలకు ఒకమారు గుర్తు చేయాలని సూచించారు.
పరిషత్ ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టడానికి టీడీపీ, కాం గ్రెస్‌లు చాలా ఎత్తులు వేస్తాయని, వాటిని అందరం కలి సి తిప్పికొట్టాలని అన్నారు. తన తండ్రి గుడివాడ గురునాథ్‌రావు మాదిరిగానే తాను సైతం కార్యకర్తలను నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. అనంతరం మా డుగుల సమన్వయ కర్త బూడి ముత్యాలనాయుడు మా ట్లాడుతూ ధర్మశ్రీ పార్టీలో చేరికతో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పార్టీ మరింత బలపడిందన్నారు.