పెనుమూరు: ఆటోలో ఆరు ఎర్రచందనం దుంగలు తరలి స్తున్న ఇద్దరు తమిళనాడువాసులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన పెనుమూరు మండలంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రతాపరెడ్డి కథనం మేరకు తమిళనాడులోని అంబత్తూరు సమీపంలోని పడగంటి గ్రామానికి చెందిన శివకుమార్(30) వేలూరుకు చెందిన పి.కుమార్ (40) సహా 10 మంది ఎర్ర కూలీలు తిరుపతి శేషాచల అడవుల్లో కొంతకాలంగా పనిచేస్తున్నారు.
గురువారం శివకుమార్, కుమార్ ఆరు ఎర్రచందనం దుంగలను గోనెసంచుల్లో దాచుకుని ఆటోలో తమిళనాడుకు తరలిస్తున్నారు. పెనుమూరు మండలంలోని రామకృష్ణాపురం వద్ద పోలీసులు వీరిని పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగ లు సహా ఏపీ03 డబ్ల్యూ 9524 నెంబర్‌గల ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండుకు పంపారు. పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, ఆటో విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుంది.
మాపాక్షి వద్ద మరో ముగ్గురి పట్టివేత
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం కేసులో చిత్తూరు తాలూకా పోలీసులు ముగ్గురు కూలీలను అరెస్టు చేసి రిమాండుకు పంపారు. చిత్తూరు తాలూకా ఎస్‌ఐ బి.సుధాకర్ కథనం మేరకు.. బుధవారం చిత్తూరు గ్రామీణ మండలంలోని మాపాక్షి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు అనుమానిత వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నారు.
ఈ సమయంలో ముగ్గురు నిందితులు పోలీసులపై తిరగబడి కత్తులు, కొడవళ్లతో చంపడానికి ప్రయత్నించారు. అనంతరం నిందితులు సెంథిల్, ఓస్‌లాగ్, ముత్తురాజును పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 111 కిలోల బరువున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.1లక్షలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. నిందితులపై కేసు నమో దు చేసి గురువారం రిమాండుకు తరలించినట్లు ఎస్‌ఐ సుధాకర్ పేర్కొన్నారు.
రూ.4.5 లక్షల ఎర్రచందనం స్వాధీనం
కేవీపల్లి: శేషాచల అడవుల నుంచి అక్రమంగా తరలిస్తు న్న రూ.4.5 లక్షల విలువైన ఎర్రచందనాన్ని కేవీపల్లి పో లీసులు పట్టుకున్నారు. జిల్లేళ్లమంద పంచాయతీ దే వాండ్లపల్లి సమీపంలోని బ్రిడ్జి కింద దాచిన ఎర్రచందనాన్ని తరలిస్తున్నారని సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించా రు. వాహనం సహా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గూడూరుకు చెందిన సురేంద్రరెడ్డి, బెంగళూరుకు చెందిన గణేష్, చిక్కబళ్లాపూరుకు చెందిన రమేష్‌ను అరెస్ట్ చేశారు. వైఎస్సార్ జిల్లా సుండుపల్లికి చెంది న నాగరాజు, హోస్‌పేటకు చెందిన విజయ్ పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అరెస్టు చేసిన వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు.
11 మంది ఎర్ర కూలీల అరెస్ట్
చంద్రగిరి: మండలంలోని శ్రీవారిమెట్టు మార్గంలో 11 మంది ఎర్రకూలీలను చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ జాన్ కెనడీ విలేకరుల సమావేశం నిర్వహిం చారు. మండలంలోని శ్రీనివాసమంగాపురం శ్రీవారిమెట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద బుధవా రం ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు జరిపామని ఎస్‌ఐ తెలిపారు. దాడుల్లో ప్రధాన సూత్రధారి కుమరన్ పరారయ్యాడని పేర్కొన్నారు. 11 మంది కూలీలతో పాటు వారి నుంచి ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడిన కూలీలు తమిళనాడు, ధర్మపురి జిల్లాకు చెందిన వారని ఆయన అన్నారు. దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ హబీబ్ భాయి, సిబ్బంది సుబ్బన్న, బాబు, జయరాం తది తరులు పాల్గొన్నారు.
ఇద్దరు ఎర్ర దొంగల అరెస్టు
Published Fri, Oct 3 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement
Advertisement