Manisha Kumari
-
ఆచూకీ తెలిపితే.. నగదు బహుమతి!
సంగారెడ్డి: నాలుగు రోజుల క్రితం బాలిక ఇంటి నుంచి వెళ్లి అదృశ్యం కాగా, ఆచూకీ తెలిపిన వారికి నజరానా ఇస్తామని జిన్నారం సీఐ వేణు కుమార్ శుక్రవారం ప్రకటించారు. ఆయన కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రం సమస్తీపూర్ జిల్లా పులహరానికి చెందిన సత్యకుమారి, శత్రుధన్ ముఖియా భార్యాభర్తలు. 6 నెలలుగా మండలంలోని మల్కాపూర్‌లో నివాసం ఉంటున్నారు. సత్యకుమారి సోదరి మనీషా కుమారి (11) 2 నెలలుగా ఆమె వద్దే ఉంటోంది. ఈనెల 25న మనీషా కుమారి తెల్లవారుజాము ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక బిహారీ, హిందీ మాత్రమే మాట్లాడగలదు. ఆమె ఆచూకీ తెలిస్తే 87126 56752, 87126 56730, 91775 15983 నంబర్లకు గానీ డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని, 5 వేల నజనారా అందిస్తామని సీఐ వేణు కుమార్, ఎస్ఐ సుభాష్ ప్రకటించారు. -
చెంప ఛెళ్..!
చూస్తుంటే ముందు వివాదం పుట్టి... తరువాత రాఖీసావంత్ పుట్టినట్టుంది. ఎందుకంటే ఈ అమ్మడికి ఎప్పుడూ ఎవరో ఒకరితో పేచీనే. లేటెస్ట్గా ఈ తార స్నేహితురాలు మనీషా కుమారి... దర్శకుడు సచీంద్ర శర్మను స్టేజిపైనే చెంప ఛెళ్లుమనిపించింది. దీనికి రియాక్షన్‌గా సచీంద్ర కూడా ఆమె గూబ గుయ్యిమనిపించాడు. ఈ ఎపిసోడ్లో స్టేజీపైనే ఉన్న రాఖీ మాత్రం మిత్రురాలినే వెనకేసుకొచ్చింది. మనీషా ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్లో సచీంద్రపై ఫిర్యాదు చేసింది. తన సినిమాలో చాన్స్ కావాలంటే కాంప్రమైజ్ కమ్మంటున్నాడనేది ఫిర్యాదు సారాంశం. సచీంద్ర సతీమణి కూడా ఎదురు కంప్లయింట్ చేసింది. మొత్తానికి రాఖీ మరోసారి వివాదానికి కేరాఫ్ అయిందన్నమాట!