
చెంప ఛెళ్..!
చూస్తుంటే ముందు వివాదం పుట్టి... తరువాత రాఖీసావంత్ పుట్టినట్టుంది. ఎందుకంటే ఈ అమ్మడికి ఎప్పుడూ ఎవరో ఒకరితో పేచీనే. లేటెస్ట్‌గా ఈ తార స్నేహితురాలు మనీషా కుమారి... దర్శకుడు సచీంద్ర శర్మను స్టేజిపైనే చెంప ఛెళ్లుమనిపించింది. దీనికి రియాక్షన్‌గా సచీంద్ర కూడా ఆమె గూబ గుయ్యిమనిపించాడు.
ఈ ఎపిసోడ్‌లో స్టేజీపైనే ఉన్న రాఖీ మాత్రం మిత్రురాలినే వెనకేసుకొచ్చింది. మనీషా ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్‌లో సచీంద్రపై ఫిర్యాదు చేసింది. తన సినిమాలో చాన్స్ కావాలంటే కాంప్రమైజ్ కమ్మంటున్నాడనేది ఫిర్యాదు సారాంశం. సచీంద్ర సతీమణి కూడా ఎదురు కంప్లయింట్ చేసింది. మొత్తానికి రాఖీ మరోసారి వివాదానికి కేరాఫ్ అయిందన్నమాట!