
సాక్షి, నల్గొండ : జిల్లాలోని దేవరకొండ మండలం ముదిగొండలో దారుణం జరిగింది. సందగళ్ల సుభాష్(28) అనే యువకుడిని అతి కిరాతకంగా బతికుండగానే పెట్రోల్ పోసి చంపేశారు. మృతుని మానసిక స్థితి సరిగా ఉండదని గ్రామస్థులు చెపుతున్నారు. కాగా దుండగులు అర్ధరాత్రి సమయంలో సుభాష్ కాళ్ళు, చేతులు కట్టేసి ఊరి బయట పొలాల్లో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మృతుని కుటుంబ సభ్యులు అంతా దేవరకొండలో ఉంటారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment