
నెల్లూరు(సెంట్రల్): క్రికెట్ బెట్టింగ్ కేసులో టీడీపీ నేత దువ్వూరు శరత్‌చంద్ర కుమారుడు దువ్వూరు సుభాష్‌ను ఆరోనగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సుభాష్ అరెస్ట్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పది రోజుల క్రితమే సుభాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో నామమాత్రపు కేసులు పెట్టి అరెస్ట్ చూపించినట్లు తెలుస్తోంది. సుభాష్ వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, రూ.1,540 నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బాలాజీనగర్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment