నెట్‌బాల్ జట్ల సారథులుగా పాషా, హారిక
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను గురువారం ప్రకటించారు. పురుషుల జట్టుకు సయ్యద్ అథర్ పాషా, మహిళల జట్టుకు ఆనంద హారిక సింగ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ టోర్నీ ఢిల్లీలో డిసెంబర్ 31 నుంచి జనవరి 3 వరకు జరుగుతుంది.
జట్ల వివరాలు: పురుషుల జట్టు: అథర్ పాషా (కెప్టెన్), నిజామ్, సాయి కిషోర్, రాజేందర్, శ్రీకాంత్, ఓంప్రకాశ్, విజయ్ కుమార్, నాగ హర్ష, ప్రసన్న, రాజశేఖర్, సందీప్, పవన్, బాలరాజు (కోచ్), సమ్మయ్య (మేనేజర్). మహిళల జట్టు: హారిక (కెప్టెన్), పావని, శైలజ, సహజ, సంజన, నందిని, సంగీత, శిరీష, సుప్రియ, రజిత, భావన, శ్రీజ, షేక్ అహ్మద్ (కోచ్), నందు కుమార్ (మేనేజర్).