ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. తిరుమలగిరి నుంచి తొర్రూరు వైపు వె ళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ పాషా(30)తో పాటు ఐలమ్మ(58) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.