Ailamma
-
ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్నిఏర్పాటు చేయాలి
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 31వ వర్ధంతి సందర్భంగా పోస్టర్‌ను ఫిలింనగర్ రజక సంఘం అధ్యక్షుడు కనకయ్య ఆదివారం ఫిలింనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. చాకలి ఐలమ్మ పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని ట్యాంక్‌బండ్‌పై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. రజకులకు ప్రత్యేక సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీన రజకుల ఆత్మగౌరవ సభకు పెద్ద సంఖ్యలో విచ్చేయాలని, సుందరయ్య కళానిలయంలో జరిగే ఈ కార్యక్రమానికి రజక కులస్తులంతా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో ఫిలింనగర్ రజక సంఘం నాయకులు వి.రామలింగం, ఎం.శ్రీనివాస్, బి.యాదగిరి, జి.ఎల్లయ్య, ఆర్.బాలనర్సయ్య, ఎం.మణెమ్మ, జి.లలిత తదితరులు పాల్గొన్నారు. -
చాకలి ఐలమ్మ వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ
సెప్టెంబర్ 10వ తేదిన తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న చాకలి ఐలమ్మ 31వ వర్ధంతి సభ పోస్టర్‌ను మంగళవారం ఎస్వీకేలో ఆవిస్కరించారు. పోస్టర్‌ను ఆవిష్కరించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ..చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయటంతో పాటు ఆమె వ ర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు ఐ.తిరుమలి, మురళీ మనోహర్, ఎంబీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.ఆశయ్య, రజక వృత్తిదారుల సంఘం కార్యదర్శి జి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
లారీ-ఆటో ఢీ.. ఇద్దరి మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. తిరుమలగిరి నుంచి తొర్రూరు వైపు వె ళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ పాషా(30)తో పాటు ఐలమ్మ(58) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
దూరదర్శన్‌లో ఐలమ్మ జీవిత చరిత్ర
హైదరాబాద్: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ నిజ జీవిత చరిత్రను సీరియల్‌గా దూరదర్శన్‌లో ప్రసారం కానుంది. ఈ నెల 2 నుంచి దూరదర్శన్ యాదగిరి ఛానల్లో ప్రసారం చేయనున్నట్టు దర్శక నిర్మాత నాగబాల సురేష్‌కుమార్ చెప్పారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీలో ఉన్న తెలుగు టీవీ ఫెడరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చాకలి ఐలమ్మ సీరియల్ విశేషాలను తెలియజేశారు. మంగళవారం రాత్రి 7-30 గంటలకు ఇది ప్రసారమవుతుందని, డైలీ సీరియల్‌గా ఈ ధారావాహిక కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీనిని అదేరోజు ప్రసారం చేయడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. పెత్తందారీ వ్యవస్థను నామరూపాల్లేకుండా చేయాలనే కసితో, నిజాం దొరలను చీల్చి చెండాడాలనే చైతన్యంతో ఉద్యమించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ఆమె తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ స్పూర్తి ప్రదాత అని తెలియజేశారు. -
ఐలమ్మ అందరికీ ఆదర్శం
బంజారాహిల్స్: రజాకార్ల ఆగడాలకు ఎదురొడ్డి నిలిచిన చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచిందని, ఆమె ఉద్యమ స్ఫూర్తితో రజకుల సమస్యలపై పోరాటం చేస్తామని రజక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 29వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రజక సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన రజక ఆత్మగౌరవ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నేత పల్లె వీణా రెడ్డి, టీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి, రజక సంఘం నేతలు రాధ, సింగారం శేఖర్,ఆర్ దేవేందర్,యాకయ్య,బాపురాజు,సాంబయ్య తదితరులున్నారు. సబ్ ప్లాన్‌ను ఏర్పాటు చేయాలి సుందరయ్య విజ్ఞాన కేంద్రం: వృత్తిదారులకు సబ్ ప్లాన్‌ను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 29వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీతారాములు మాట్లాడుతూ రజకులకు సామాజిక భద్రత చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటిన వృత్తిదారుల సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. భూమి కోసం, భక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం ఐక్యంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ గ్రేటర్ కన్వీనర్ జి.నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య, బ్యాండు,వాయిద్య కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఓగ్గు శ్రీనివాస్,నాయకులు నాగరాజు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి దోమలగూడ: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, ఆమె వర్ధంతి, జయంతిలను ప్రభుత్వమే నిర్వహించాలని తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఐలమ్మ 29వ వర్ధంతి సభను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ వర్ధంతిని పట్టించుకోకపొవడం, ట్యాంక్‌బండ్‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఆత్మ గౌరవం కోసం ఐలమ్మ జరిపిన పోరాటం నేటి తరాలకు ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూషరాజు యాదమ్మ, సహాయకార్యదర్శి రంగస్వామి, గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షుడు రామస్వామి, కార్యదర్శి స్వామి, నాయకులు కొమురయ్య, రత్పంరాజు, కె బి విజయ్‌కుమార్, ఎం రాజు, లక్ష్మినారాయణ, వెంకటేష్, యుంగధర్, భూతరాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.