తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 31వ వర్ధంతి సందర్భంగా పోస్టర్‌ను ఫిలింనగర్ రజక సంఘం అధ్యక్షుడు కనకయ్య ఆదివారం ఫిలింనగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. చాకలి ఐలమ్మ పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని ట్యాంక్‌బండ్‌పై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. రజకులకు ప్రత్యేక సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీన రజకుల ఆత్మగౌరవ సభకు పెద్ద సంఖ్యలో విచ్చేయాలని, సుందరయ్య కళానిలయంలో జరిగే ఈ కార్యక్రమానికి రజక కులస్తులంతా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో ఫిలింనగర్ రజక సంఘం నాయకులు వి.రామలింగం, ఎం.శ్రీనివాస్, బి.యాదగిరి, జి.ఎల్లయ్య, ఆర్.బాలనర్సయ్య, ఎం.మణెమ్మ, జి.లలిత తదితరులు పాల్గొన్నారు.
ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్నిఏర్పాటు చేయాలి
Published Sun, Sep 4 2016 7:27 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
Advertisement
Advertisement