kanakaiah
-
నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆత్మహత్య
సాక్షి, నిజామాబాద్: సైబర్ మోసగాళ్ల వలలో పడి నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో కలకలం రేపింది. గాయత్రినగర్‌లో ఉండే కన్నయ్యకుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అయితే శనివారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కన్నయ్య కుమార్ గౌడ్ ఫోన్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన ఎన్నికలు అఫిడవిట్ సైతం సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు చెబుతున్నారు. రెండు రోజుల్లో గృహప్రవేశం పెట్టుకున్న కన్నయ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. చదవండి: వారసులకు ‘హోం’ సిక్ -
ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్నిఏర్పాటు చేయాలి
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 31వ వర్ధంతి సందర్భంగా పోస్టర్‌ను ఫిలింనగర్ రజక సంఘం అధ్యక్షుడు కనకయ్య ఆదివారం ఫిలింనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. చాకలి ఐలమ్మ పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని ట్యాంక్‌బండ్‌పై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. రజకులకు ప్రత్యేక సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీన రజకుల ఆత్మగౌరవ సభకు పెద్ద సంఖ్యలో విచ్చేయాలని, సుందరయ్య కళానిలయంలో జరిగే ఈ కార్యక్రమానికి రజక కులస్తులంతా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో ఫిలింనగర్ రజక సంఘం నాయకులు వి.రామలింగం, ఎం.శ్రీనివాస్, బి.యాదగిరి, జి.ఎల్లయ్య, ఆర్.బాలనర్సయ్య, ఎం.మణెమ్మ, జి.లలిత తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
రుణ భారం తాళలేక ఓ రైతు బలవన్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా రాజపేట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కొండేటిచెరువు గ్రామానికి చెందిన రైతు ఎల్మ కనకయ్య(35) ఆదివారం రాత్రి పొలానికి వెళ్లి అక్కడే ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన రైతులకు అతడు చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. ఈ ఏడు సరిగా పంటలు సరిగా పండకపోవటంతో అప్పులు తీర్చే దెలాగో తెలియక కనకయ్య ఆత్మహత్య చేసుకున్నాడని రైతులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఎమ్మార్వో దంపతులకు గాయాలు
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం ఎదురుగట్ల గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తహశీల్దార్ దంపతులకు గాయాలు అయ్యాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట తహశీల్దార్ కనకయ్య, భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఆదివారం స్వగ్రామం ఎదురుగట్లకు వచ్చారు. సాయంత్రం తిరుగు ప్రయాణమైన కొద్దిసేపటికే వారి కారును ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. కనకయ్య, ఆయన భార్యకు గాయాలు కాగా, వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
షాకులమీద షాకులిస్తున్న టిఆర్ఎస్
హైదరాబాద్: ఖమ్మం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కొర్రం కనకయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)లో చేరుతున్నట్లు కూడా కనకయ్య ప్రకటించారు. గత ఎన్నికలలో ఇల్లందు ఎస్టీ నియోజకవర్గం నుంచి కనకయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా 11వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అధికార పార్టీ టిఆర్ఎస్ కాంగ్రెస్, టిడిపిలకు షాకులమీద షాకులిస్తోంది. ఇప్పటికే ఈ పార్టీలకు చెందిన పలువురు టిఆర్ఎస్లో చేరారు. తాజాగా ఎమ్మెల్యే కనకయ్య ఆ పార్టీలో చేరనున్నారు. ఖమ్మం జిల్లా నుంచే టిడిపి నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల క్రితం కనకయ్య తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. అప్పుడే ఆయన టిఆర్ఎస్లో చేరబోతున్నట్లు అర్ధమైపోయింది. -
ట్రాన్సఫార్మర్కు మరమ్మతు చేస్తూ..
విద్యుదాఘాతంతో రైతు మృతి మర్పడగలో విషాదం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనన్న గ్రామస్తులు కొండపాక : ట్రాన్స్ఫార్మర్ ఎక్కి వైరు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మర్పడగ శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుం ది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన రైతు వల్లంగల్ల కనకయ్య (46) తనకున్న రెండెకరాల పొలాన్ని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఉదయం యథావిధిగా ఉదయం ఆరు గంటలకు పాలు తీసుకెళ్లి గ్రామంలో వేసి వచ్చాడు. అయితే కరెంట్ వచ్చే సమయంలో కావడంతో కనకయ్య పొలం వద్దకు వెళ్లి బోరు మోటారు ఆన్ చేశాడు. కాగా బోరుకు కరెంట్ సరఫరా కాకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి చూశాడు. ఇదిలా ఉండగా.. ట్రాన్స్ఫార్మర్కు ఉండే మూడు ఫ్యూజ్‌ల స్థానంలో బోల్టులు బిగించి ఉంటాయి. కాగా ఒక నట్ బోల్ట్ స్థానంలో అల్యూమినియం వైర్ చుట్టా రు. అది వేడికి పదే పదే కాలిపోతూ ఉంటుంది. అయితే అవసరాన్ని బట్టి రైలు ఎవరికి వారు వేసుకుంటుంటారు. అందులో భాగంగానే రైతు కనకయ్య ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి వైరును బిగించడానికి పైకి ఎక్కాడు. వైరును బిగిస్తున్న క్రమంలో మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫార్మర్కు వచ్చే 11 కేవీ లైన్ ప్రమాదవశాత్తు కనకయ్య తలకు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని మరో రైతు రంగయ్య గుర్తించి గ్రామంలోకి పరుగున వెళ్లి చెప్పాడు. బాధిత కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడికి భార్య బాల లక్ష్మి, కుమారుడు వేణు (22), ఇద్దరు కుమార్తెలు లావణ్య (18), లత (15)లు ఉన్నారు. సమాచారం అం దుకున్న ఎస్ఐ జార్జ్ గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించా రు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొండపాక ఎంపీపీ పద్మ, పీఏసీఎస్ డెరైక్టర్ నరేందర్‌లు మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుం బాన్ని ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ సభ్యులు బాల్‌రాజ్, ఆకారం, యాదగిరిలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే .. : ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్ష్యంతోనే రైతు కనకయ్య మృతిచెందాడని గ్రామ రైతులు పలువురు ఆరోపించారు. 15 రోజులుగా వైరు కాలిపోతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వీరి నిర్లక్ష్యంతోనే కనకయ్య మృతిచెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.