అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | The farmer committed suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Mon, Feb 22 2016 8:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

The farmer committed suicide

రుణ భారం తాళలేక ఓ రైతు బలవన్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా రాజపేట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కొండేటిచెరువు గ్రామానికి చెందిన రైతు ఎల్మ కనకయ్య(35) ఆదివారం రాత్రి పొలానికి వెళ్లి అక్కడే ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన రైతులకు అతడు చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. ఈ ఏడు సరిగా పంటలు సరిగా పండకపోవటంతో అప్పులు తీర్చే దెలాగో తెలియక కనకయ్య ఆత్మహత్య చేసుకున్నాడని రైతులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement