
నల్లగొండ: అప్పుల బాధ భరించలేక ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని సాగర్ తిరుమలగిరి మండలం భట్టువెంకన్నబావి తండాకు చెందిన జఠావత్ ధనరాజ్(27) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
గత రెండేళ్లుగా పంట దిగుబడి సరిగ్గా లేదు. దీంతో తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.