సాక్షి, నిజామాబాద్: సైబర్ మోసగాళ్ల వలలో పడి నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో కలకలం రేపింది. గాయత్రినగర్‌లో ఉండే కన్నయ్యకుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అయితే శనివారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కన్నయ్య కుమార్ గౌడ్ ఫోన్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన ఎన్నికలు అఫిడవిట్ సైతం సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు చెబుతున్నారు.
రెండు రోజుల్లో గృహప్రవేశం పెట్టుకున్న కన్నయ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు.
చదవండి: వారసులకు ‘హోం’ సిక్
Comments
Please login to add a commentAdd a comment