నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ రాజకీయ చరిత్ర
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన గణేష్ బిగాల మరోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి తాహిర్ బిన్ హమదాన్పై 26055 ఓట్ల ఆదిక్యత సాదించారు. గణేష్ గుప్తాకు 71397 ఓట్లు రాగా, తాహిర్ బిన్ కు 45342 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే ఇ.లక్ష్మీనారాయణకు సుమారు ఇరవై మూడువేల ఓట్లు వచ్చాయి. లక్ష్మినారాయణ 2009 ఎన్నికలలో గెలిచిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో బాగంగా ఆయన తన పదవికి రాజీనామా చేసి, తిరిగి ఉప ఎన్నికలో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికలో అప్పటి పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను ఆయన ఓడిరచారు. కాని తదుపరి జరిగిన ఎన్నికలలో లక్ష్మినారాయణ గెలవలేక పోయారు. గణేష్ బిగాల వైశ్య సామాజికవర్గానికి చెందిన వారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ సామాజికవర్గం నుంచి ఈయన ఒక్కరే గెలిచారు.
ఈ నియోజక వర్గంలో మున్నూరుకాపు వర్గం నేతలు ఎక్కువగా గెలిచినా, ఇతర సామాజిక వర్గాల వారికి కూడా అవకాశం రావడం విశేషం.11 మంది బిసి నేతలు ప్రదానంగా మున్నూరు కాపు సామాజికవర్గం వారు ఎన్నికవుతూ వచ్చారు.రెండుసార్లు ముస్లింలు, రెండుసార్లు వైశ్య, ఒకసారి ఇతరులు కూడా ఎన్నికయ్యారు. సీనియర్ నేత డి.శ్రీనివాస్ 1989, 1999, 2004లలో ఇక్కడ నుంచి మూడుసార్లు గెలుపొందారు. ఈయన 1989-94 మధ్యకాలంలో, అలాగే 2004లో వై.ఎస్.మంత్రివర్గంలోను సభ్యునిగా ఉన్నారు. రెండుసార్లు పిసిసి అద్యక్షుడు అయ్యారు. శాసనమండలిలో కాంగ్రెస్ ఐ పక్షాన ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. కాని ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు.
తదుపరి రాజ్యసభకు టిఆర్ఎస్ పక్షాన ఎన్నికయ్యారు. కాని కొంతకాలానికి టిఆర్ఎస్ లో అసమ్మతి నేతగా మారారు. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ బిజెపిలో చేరి నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ముఖ్యమంత్రి కెసీఆర్ కుమార్తె కవితను ఓడిరచి సంచలనం సృష్టించారు. నిజామాబాదులో 16సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు కలిసి ఆరుసార్లు, టిడిపి మూడుసార్లు, బిజెపి రెండుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు గెలవగా, ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ నుంచి గెలుపొంద గలిగారు. టిడిపి పక్షాన డి. సత్యనారాయణ రెండుసార్లు, కాంగ్రెస్ నేత డి.హుస్సేన్ రెండుసార్లు గెలిచారు. డి. సత్యనారాయణ ఎన్.టి.ఆర్. క్యాబినెట్లో ఉన్నారు.
నిజామాబాద్ అర్బన్‌లో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..