షాకులమీద షాకులిస్తున్న టిఆర్ఎస్ | MLA Kanakaiah resign to congress | Sakshi
Sakshi News home page

షాకులమీద షాకులిస్తున్న టిఆర్ఎస్

Published Sun, Aug 31 2014 5:20 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఎమ్మెల్యే కనకయ్య - Sakshi

ఎమ్మెల్యే కనకయ్య

హైదరాబాద్: ఖమ్మం జిల్లా  ఇల్లందు ఎమ్మెల్యే కొర్రం కనకయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)లో చేరుతున్నట్లు కూడా కనకయ్య ప్రకటించారు. గత ఎన్నికలలో ఇల్లందు ఎస్టీ నియోజకవర్గం నుంచి కనకయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా 11వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

అధికార పార్టీ టిఆర్ఎస్ కాంగ్రెస్, టిడిపిలకు షాకులమీద షాకులిస్తోంది. ఇప్పటికే ఈ పార్టీలకు చెందిన పలువురు టిఆర్ఎస్లో చేరారు.  తాజాగా ఎమ్మెల్యే కనకయ్య ఆ పార్టీలో చేరనున్నారు. ఖమ్మం జిల్లా నుంచే టిడిపి నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు.  రెండు రోజుల క్రితం కనకయ్య తెలంగాణ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. అప్పుడే ఆయన టిఆర్ఎస్లో చేరబోతున్నట్లు అర్ధమైపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement