Charminar Assembly Constituency
-
మజ్లిస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు నో ఛాన్స్!
హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారు కాగా.. మజ్లిస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. ఈసారి చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు టికెట్ లభించదని ప్రచారాలు జరగుతుండడంతో.. ముంతాజ్ అహ్మద్ ఖాన్ కాకుండా మరెవరికి టికెట్ కేటాహిస్తారోనని చార్మినార్నియోజకవర్గం మజ్లిస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈసారి ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు పార్టీ టికెట్ లభించకపోతే.. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని మరీ పోటీ చేయించడానికి ఆయన కుమారులు పట్టుబడుతున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చారి్మనార్, యాకుత్‌పురా నుంచి కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్లు గతంలోనే చెప్పారని.. దీంతో ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో పాటు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీలకు ఈసారి టికెట్లు లభించవని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చివరి నిమిషం వరకు వేచి ఉండి.. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు యాకుత్‌పురా సిట్టింగ్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ నిశబ్దంగా ఉన్నప్పటికీ.. ముంతాజ్ అహ్మద్ ఖాన్ మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోతే.. తన తనయునికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. చివరి నిమిషం వరకు వేచి ఉండి.. ఇక టికెట్ రాదని తెలిస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ మారడం తప్పా.. ఆయన వద్ద మరో మార్గం లేదంటున్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ పార్టీ మారడానికి సిద్ధంగా ఉంటే.. తమ పార్టీలోకి ఆహా్వనించి చార్మినార్ నుంచి టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో దింపడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే టీటీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న అలీ మస్కతిని చార్మినార్ నియోజకవర్గం నుంచి పోటీలోకి దింపుతున్నట్లు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ప్రకటించినప్పటికీ.. ఇప్పటికే రెండు దఫాలుగా విడుదలైన అధికారిక లిస్టులలో ఎక్కడా అలీ మస్కతి పేరు లేకపోవడంతో ముంతాజ్‌ఖాన్ కోసం ఈ సీటు రిజర్వ్ పెట్టినట్లు పాతబస్తీలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చార్మినార్ నుంచి ముంతాజ్ ఖాన్‌కు టికెట్ లభిస్తే.. అలీ మస్కతిని హైదరాబాద్ పార్లమెంట్‌కు పోటీ చేయించే యోచనలో పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఇంత వరకు అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పార్టీ చార్మినార్ అభ్యరి్థని ప్రకటించడం లేదని అంటున్నారు. ఈసారి మజ్లిస్ పార్టీకి దీటుగా.. కాంగ్రెస్ చార్మినార్ నుంచి మజ్లిస్ పార్టీకి దీటుగా తమ అభ్యర్థని ఎన్నికల బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. 2009, 2014, 2018 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతో మజ్లిసేతర పార్టీలు హోరాహోరి ఎన్నికల పోరాటం చేసినప్పటికీ.. అంతిమ విజయం మజ్లిస్ పార్టీకే దక్కింది. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఈసారి పాతబస్తీలో కూడా ఊహించని రాజకీయ పరిణాలు ఎదురవుతాయని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు. మజ్లిస్ పార్టీలో సిట్టింగ్‌లకు టికెట్లు లభించకపోతే.. పాతబస్తీ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని అంటున్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ రాజకీయ అరంగేటం బజ్లిస్ బజావ్ తెహ్రీఖ్(ఎంబీటీ)తో మొదలైంది. ఎంబీటీ పార్టీ టికెట్‌పై యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం పార్టీ ఫిరాయించి మజ్లిస్ పారీ్టలో చేరారు. అప్పటి నుంచి పోటీ చేసిన ప్రతి ఎన్నికలో విజయం సాధించారు. ప్రస్తుతం చారి్మనార్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ పార్టీ మారే ప్రసక్తే ఉండదని.. ఇవన్నీ రాజకీయ ఊహాగానాలేనని దారుస్సలాం నాయకులు అంటున్నారు. -
చార్మినార్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఏమాయే ?
హైదరాబాద్: చార్మినార్ శాసన సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు అధికారికంగా అభ్యర్థి పేరు ప్రకటించ లేదు. ఇప్పటికే రెండు దఫాలుగా లిస్టులు వెలువడినప్పటికీ.. రెండింట్లో చార్మినార్ అభ్యర్థి పేరు లేదు. హైదరాబాద్ జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ పోటీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించినప్పటికీ.. చార్మినార్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు పేరు ప్రకటించ లేదు. అయితే ఊహించని విధంగా అనూహ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాత్రం చార్మినార్ నియోజకవర్గం నుంచి అలీ మస్కతి ఎన్నికల బరిలో ఉంటారని ప్రకటించారు. అప్పటికీ పార్టీ అధిష్ఠానం ఎక్కడ ఏ ఒక్క అభ్యర్థని ప్రకటించ లేదు. అయినప్పటికీ.. చార్మినార్ నుంచి అలీ మస్కతి పేరును విలేకర్ల ముందు ప్రకటించారు. చార్మినార్ నుంచి పోటీ చేయడానికి అలీ మస్కతి కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గతంలో ఒకసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన చార్మినార్ కాకుండా మరో ఇతర స్థానం నుంచి పోటీ చేస్తే బావుంటుదనే ఆలోచనలో అలీ మస్కతి కుటుంబసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ విషయంలో అలీ మస్కతి ఎటూ తేల్చుకోలేని సందిగ్దంలో ఉన్నట్లు ఆయన అనుచరులు బహిరంగంగా చెబుతున్నారు. టికెట్ ఆశిస్తూ రూ.50 వేలు కట్టి దరఖాస్తులు చేసిన నాయకులు.. అప్పటి వరకు చార్మినార్ నియోజకవర్గం నుంచి తమకే టికెట్ కేటాయించాలని గాంధీభవన్‌లో రూ.50 వేలు కట్టి దరఖాస్తులు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు కొంత నిరాశకు గురయ్యారు. మొన్నటి వరకు టీడీపీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేసిన అలీ మస్కతి గతంలో జరిగిన ఎన్నికల్లో చారి్మనార్ నుంచి టీడీపీ అభ్యరి్థగా ఎన్నికల బరిలోకి దిగి పోటీ చేశాడని.. సడెన్‌గా పార్టీ మారడంతోనే చార్మినార్ టికెట్ ఎలా ఇస్తారని దరఖాస్తులు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ చోటామోటా నాయకులు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఇప్పటికే కె.వెంకటేష్, అస్ఘర్ అలీ బేగ్, షాబాజ్ ఖాన్, ముజీబుల్లా షరీఫ్, వంశీకృష్ణ తదితరులు తమకు టికెట్ కేటాయించాలని కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి ప్రకటనతో వెనక్కి తగ్గిన ఆశావహులు.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటనల మేరకు దరఖాస్తులు చేసుకున్న వారిలో ఎవరో ఒకరికి టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ.. అలీ మస్కతి పేరును ఢిల్లీలో రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో వీరంతా తమ పోటీ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇందులో ఏ ఒక్కరూ అలీ మస్కతి ప్రకటనను వ్యతిరేకించ లేదు. అయినప్పటికీ.. పాతబస్తీలోని యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా తదితర నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ప్రకటించగా.. చారి్మనార్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో తిరిగి ఆశావహులు ఎంతో ఆశతో టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. టికెట్ ఆశించిన చారి్మనార్ నాయకులంతా గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నియోజకవర్గంలో సీనియర్లమైన తమకు మాత్రమే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్న వారు కొందరైతే.. ఎన్నో ఏళ్లుగా పార్టీలో క్రీయాశీలక కార్యకర్తలుగా, నాయకులుగా పని చేస్తున్న తమకు కాకుండా ఇటీవల పార్టీ మారిన నాయకునికి టికెట్ కేటాయించడం సరైంది కాదని మరికొందరంటున్నారు. అలీ మస్కతిని గెలిపిస్తాం..ఇప్పటికే టీడీపీ నుంచి పోటీ చేసి మజ్లిస్ పారీ్టకి గట్టి పోటీనిచి్చన అలీ మస్కతికి చార్మినార్ నుంచి టికెట్ కేటాయిస్తే.. భారీ మెజారీ్టతో గెలిపిస్తామని మరికొంత మంది నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్ను ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆశించిన ఫలితాలు సాధించడానికి కృషి చేస్తామంటున్నారు. ఎలాంటి బేధాభిప్రాయాలకు తావివ్వకుండా నియోజకవర్గంలోని అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీ జెండాపై పోటీ చేసి విజయం సాధిస్తామంటున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు పని చేస్తామంటున్నారు. -
చార్మినార్ నియోజకవర్గం తదుపరి అధికార పార్టీ..?
చార్మినార్ నియోజకవర్గం మజ్లిస్ పార్టీ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ చార్మినార్ నియోజకవర్గం నుంచి ఆరోసారి గెలిచారు. అంతకుముందు ఆయన యాకుత్ పుర నుంచి ఐదుసార్లు గెలిచారు. చార్మినార్‌లో గతంలో మూడుసార్లు గెలిచిన ఖాద్రీ పాషా యాకూత్ పురాకు మారి నాలుగోసారి విజయంసాదించగా, అహ్మద్‌ఖాన్ చార్మినార్ నుంచి గెలవడం విశేషం. అహ్మద్ ఖాన్ 1994లో ఎమ్.బి.టి తరపున గెలిచారు. ఆతర్వాత మజ్లిస్‌లో చేరి వరసగా గెలుస్తున్నారు. అహ్మద్ ఖాన్ తన సమీప బిజెపి ప్రత్యర్ది ఉమా మహేంద్ర పై 32886 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసిన మహ్మద్ గౌస్‌కు 15700 ఓట్లు వచ్చాయి. ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు 53808 ఓట్లు రాగా, ఉమా మహేంద్ర కు 21222 ఓట్లు వచ్చాయి.అహ్మద్ ఖాన్ ముస్లిం నేత. హైదరాబాద్‌లోని చారిత్రాత్మకమైన చార్మినార్ శాసనసభ నియోజకవర్గంలో 1967 నుంచి కేవలం మజ్లిస్ పక్షమే గెలుస్తోంది. కొన్నిసార్లు ఇండిపెండెంట్లు గెలిచినట్లు రికార్డులు చెబుతున్నా, ఆ ఇండిపెండెంట్లు కూడా మజ్లిస్ పక్షంవారే. మజ్లిస్ పక్షానికి ఎన్నికల సంఘం గుర్తింపు లేనప్పుడు వారు ఇండిపెండెంట్లుగా పోటీచేసి గెలుపొందారు. మజ్లిస్ ప్రధాన నాయకుడు, దివంగత సలావుద్దీన్ ఓవైసీ 1967, 1978, 83లలో చార్మినార్ నుంచి, 1962లో ఫత్తర్‌గట్టి నుంచి, 1972లో యాకుత్‌పురా నుంచి గెలుపొందారు. 1962లో అప్పటి మంత్రి మాసూనా బేగంను ఓడిరచి చట్టసభలో ప్రవేశించారు. అప్పటి నుంచి ఓటమి ఎరుగని నేతగా ఐదుసార్లు అసెంబ్లీకి, ఆ తర్వాత 1984 నుంచి 1999 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆరుసార్లు గెలుపొందారు. సలావుద్దీన్ ఓవైసీ పెద్దకుమారుడు అసదుద్దీన్ ఓవైసీ చార్మినార్‌లో రెండుసార్లు శాసనసభకు హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి నాలుగుసార్లు గెలుపొందారు. రెండో కుమారుడు అక్బరుద్దీన్ ఓవైసీ 1999 నుంచి ఐదుసార్లు చాంద్రా యణగుట్ట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో తండ్రి, ఇద్దరు కుమారులు కూడా చట్టసభలలో ఉండడం కూడా ఒక అరుదైన రికార్డు. 1989లో చార్మినార్‌లో గెలుపొందిన విరాసత్ రసూల్‌ఖాన్ అంతకుముందు రెండుమార్లు అసిఫ్‌నగర్ నుంచి 2009లో నాంపల్లి నుంచి విజయం సాధించారు. చార్మినార్‌లో గెలిచినవారంతా ముస్లింలే కావడం విశేషం. చార్మినార్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..