హైదరాబాద్: చార్మినార్ శాసన సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు అధికారికంగా అభ్యర్థి పేరు ప్రకటించ లేదు. ఇప్పటికే రెండు దఫాలుగా లిస్టులు వెలువడినప్పటికీ.. రెండింట్లో చార్మినార్ అభ్యర్థి పేరు లేదు. హైదరాబాద్ జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ పోటీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించినప్పటికీ.. చార్మినార్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు పేరు ప్రకటించ లేదు. అయితే ఊహించని విధంగా అనూహ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాత్రం చార్మినార్ నియోజకవర్గం నుంచి అలీ మస్కతి ఎన్నికల బరిలో ఉంటారని ప్రకటించారు.
అప్పటికీ పార్టీ అధిష్ఠానం ఎక్కడ ఏ ఒక్క అభ్యర్థని ప్రకటించ లేదు. అయినప్పటికీ.. చార్మినార్ నుంచి అలీ మస్కతి పేరును విలేకర్ల ముందు ప్రకటించారు. చార్మినార్ నుంచి పోటీ చేయడానికి అలీ మస్కతి కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గతంలో ఒకసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన చార్మినార్ కాకుండా మరో ఇతర స్థానం నుంచి పోటీ చేస్తే బావుంటుదనే ఆలోచనలో అలీ మస్కతి కుటుంబసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ విషయంలో అలీ మస్కతి ఎటూ తేల్చుకోలేని సందిగ్దంలో ఉన్నట్లు ఆయన అనుచరులు బహిరంగంగా చెబుతున్నారు.
టికెట్ ఆశిస్తూ రూ.50 వేలు కట్టి దరఖాస్తులు చేసిన నాయకులు..
అప్పటి వరకు చార్మినార్ నియోజకవర్గం నుంచి తమకే టికెట్ కేటాయించాలని గాంధీభవన్‌లో రూ.50 వేలు కట్టి దరఖాస్తులు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు కొంత నిరాశకు గురయ్యారు. మొన్నటి వరకు టీడీపీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేసిన అలీ మస్కతి గతంలో జరిగిన ఎన్నికల్లో చారి్మనార్ నుంచి టీడీపీ అభ్యరి్థగా ఎన్నికల బరిలోకి దిగి పోటీ చేశాడని.. సడెన్‌గా పార్టీ మారడంతోనే చార్మినార్ టికెట్ ఎలా ఇస్తారని దరఖాస్తులు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ చోటామోటా నాయకులు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఇప్పటికే కె.వెంకటేష్, అస్ఘర్ అలీ బేగ్, షాబాజ్ ఖాన్, ముజీబుల్లా షరీఫ్, వంశీకృష్ణ తదితరులు తమకు టికెట్ కేటాయించాలని కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు.
రేవంత్‌రెడ్డి ప్రకటనతో వెనక్కి తగ్గిన ఆశావహులు..
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటనల మేరకు దరఖాస్తులు చేసుకున్న వారిలో ఎవరో ఒకరికి టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ.. అలీ మస్కతి పేరును ఢిల్లీలో రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో వీరంతా తమ పోటీ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇందులో ఏ ఒక్కరూ అలీ మస్కతి ప్రకటనను వ్యతిరేకించ లేదు. అయినప్పటికీ.. పాతబస్తీలోని యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా తదితర నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ప్రకటించగా.. చారి్మనార్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో తిరిగి ఆశావహులు ఎంతో ఆశతో టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. టికెట్ ఆశించిన చారి్మనార్ నాయకులంతా గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నియోజకవర్గంలో సీనియర్లమైన తమకు మాత్రమే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్న వారు కొందరైతే.. ఎన్నో ఏళ్లుగా పార్టీలో క్రీయాశీలక కార్యకర్తలుగా, నాయకులుగా పని చేస్తున్న తమకు కాకుండా ఇటీవల పార్టీ మారిన నాయకునికి టికెట్ కేటాయించడం సరైంది కాదని మరికొందరంటున్నారు.
అలీ మస్కతిని గెలిపిస్తాం..ఇప్పటికే టీడీపీ నుంచి పోటీ చేసి మజ్లిస్
పారీ్టకి గట్టి పోటీనిచి్చన అలీ మస్కతికి చార్మినార్ నుంచి టికెట్ కేటాయిస్తే.. భారీ మెజారీ్టతో గెలిపిస్తామని మరికొంత మంది నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్ను ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆశించిన ఫలితాలు సాధించడానికి కృషి చేస్తామంటున్నారు. ఎలాంటి బేధాభిప్రాయాలకు తావివ్వకుండా నియోజకవర్గంలోని అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీ జెండాపై పోటీ చేసి విజయం సాధిస్తామంటున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు పని చేస్తామంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment