సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 6న భేటీకి సిద్ధమని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజాభవన్‌లో భేటీకి రావాలని లేఖలో రేవంత్ ఆహ్వానించారు. విభజన సమస్యల పరిష్కారం కోరుకుంటున్నామని రేవంత్ పేర్కొన్నారు.
కాగా, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కలిసి చర్చించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రెండు రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమానికి పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరముందని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, రెండు రాష్ట్రాల లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పనిచేయాల్సి వుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయని చంద్రబాబు ఈ సందర్భంగా ఆ లేఖలో గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment