సాక్షి, హైదరాబాద్ : చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధుల్లో భాగంగా పాతబస్తీలోని శాలిబండలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్న ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్‌ని ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్, ఎంఐఎం నేతలు సీఏఏ వంకతో అడ్డుకున్నారు. ప్రజలందరి ముందే ఎమ్మెల్యే ఏసీపీ మహ్మద్ మజీద్‌ని నిలదీశారు. దీంతో ఏసీపీ, సిబ్బంది చేసేదేం లేక తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. కాగా, పోలీసుల తీరుపైనా ప్రజలు మండిపడుతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ పోలీసులకే తలవంపులు వచ్చాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విధులకు ఆటంకం కలిగించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే పోలీసులు వెనుదిరిగారని ఎద్దేవా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment